ఏపీ సీఎం జ‌గ‌న్ ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌ల‌ను చేర్చుకునేందుకు గేట్లు ఎత్తేశారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌శాంతంగా ఉన్న వైసీపీ రాజ‌కీయాలు ఇప్పుడిప్పుడే అల్ల‌క‌ల్లోలంలా మారుతున్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన కొద్ది రోజుల వ‌ర‌కు ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌ల‌ను పార్టీలో చేర్చుకునే అంశంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉన్న జ‌గ‌న్ ఆ త‌ర్వాత కాస్త రూల్స్ స‌డ‌లించేశారు.


మ‌రోవైపు ఏపీలో ఎట్లాగైనా వైసీపీని టార్గెట్ చేయాల‌ని చూస్తోన్న బీజేపీ ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌ల‌ను త‌మ పార్టీలో చేర్చుకుంటోంది. అలాగే వైసీపీపై మూడు నెల‌ల‌కే విమ‌ర్శ‌ల దాడి, వేడి కూడా పెంచేసింది. ఈ క్ర‌మంలోనే బ‌ల‌మైన నేత‌లు త‌మ పార్టీలోకి వ‌స్తాన‌న్న‌ప్పుడు వారిని పార్టీలోకి తీసుకోక‌పోతే అటు బీజేపీలోకి వెళ్లి తిరిగి త‌మ‌పైనే ఎటాక్ చేయ‌డం జ‌రుగుతుంద‌ని భావించిన జ‌గ‌న్ చివ‌ర‌కు జంపింగ్‌ల‌కు గేట్లు ఎత్తేశాడు.


ఇక ఇత‌ర పార్టీల నుంచి వైసీపీలో చేరిన నేత‌ల‌కు, పాత నేత‌ల‌కు మ‌ధ్య పెద్ద పంచాయితీలే న‌డుస్తున్నాయి. తాజాగా జ‌గ‌న్ ముందుకు పెద్ద పంచాయితీ రానుంది. అదే రామ‌చంద్రాపురం వైసీపీ పంచాయితీ. ఏపీ సీఎం జగన్‌ వద్దకు రామచంద్రాపురం వైసీపీ పంచాయితీ చేరింది. టీడీపీకి చెందిన సీనియ‌ర్ నేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు రాకను మంత్రి పిల్లి సుభాష్‌, రామ‌చంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వ‌ర్గాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. 


ఇప్ప‌టికే రామ‌చంద్రాపురం వైసీపీలో పిల్లి బోస్‌, చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ వ‌ర్గాలు ఉన్నాయి. ఇప్ప‌టికే వీరి వర్గాల మ‌ధ్య స‌రైన స‌ఖ్య‌త లేదు. బోస్‌కు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో రెండున్న‌ర ద‌శాబ్దాల అనుబంధం ఉంది. బోస్‌కు త్రిమూర్తుల‌కు రెండున్న‌ర ద‌శాబ్దాలుగా రాజ‌కీయ వైరం ఉంది. ఈ టైంతో త‌న రాజ‌కీయ బ‌ద్ధ శ‌త్రువు తాను ఉన్న పార్టీలోకి రావ‌డంతో బోస్ జీర్ణించుకోలేని ప‌రిస్థితి.


అటు బోస్‌తో పాటు వేణుగోపాల కృష్ణ‌పై సైతం త్రిమూర్తులు ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. ఈ క్ర‌మంలోనే త్రిమూర్తులు రాక‌ను నిర‌సిస్తూ బోస్‌, ఎమ్మెల్యే వేణు వ‌ర్గాలు మీటింగ్ పెట్టాయి. ఇక వీరు మాత్ర‌మే కాకుండా అటు జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం వ్య‌తిరేకిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ పంచాయితీ జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు చేర‌డంతో జ‌గ‌న్ ఈ పంచాయితీ ఎలా ప‌రిష్క‌రిస్తారో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: