పవన్ కళ్యాణ్ మోడీకి మంచి క్రేజ్ ఉన్న టైంలోనే ప్రత్యేక  ప్యాకేజ్ పేరు చెప్పి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని గట్టిగానే కెలికాడు. ఆ టెంపోని నాడే కొనసాగించి ఉంటే పవన్ రాజకీయ కధ వేరేగా ఉండేదన్న వారు లేకపోలేదు. అయితే పవన్ తరువాత కాలంలో ఎన్ని ట్విస్టులు  ఇచ్చారో అందరూ చూశారు, చివరకు పవన్ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇపుడు పవన్  వ్యూహాలేంటి...


ఆయన బీజేపీకి అనుకూలంగా అమరావతిలో మాట్లాడారు. మోడీ శంకుస్థాపన చేసిన రాజధానిని తరలిస్తారా అంటూ మాట్లాడారు. అమరావతి తరలింపు విషయమై తాను కేంద్రంతో చర్చిస్తానని కూడా  అన్నారు. ఇవన్నీ విన్న వారు మోడీకి, బీజేపీకి పవన్ చేరువ అయ్యారని అనుకున్నారు.  కానీ పవన్ ఇపుడు మోడీ తోనే ఢీ కొట్టబోతున్నారా. అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణలో నల్లమల అడవిని తవ్వి యురేనియం తీయాలన్న కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల తీరును తప్పు పట్టిన ఆయన ఈ రోజు హైదరాబాద్ లో రౌండ్ టేబిల్ మీటింగ్ పెడుతున్నారు. ఈ మీటింగుకు ఆయన తెలంగాణా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని పిలిచారు. అలగే అనేక పక్షాలు  కూడా ఇందులో పాల్గొంటాయని  కూడా తెలుస్తోంది. 



ఈ విషయంలో తమ పాత్ర ఏమీ లేదని ఓ వైపు కేసీయార్ చెబుతున్నారు. అయితే కేంద్రం పాత్ర మాత్రం నూటికి నూరు శాతం ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో మోడీతో మొండిగా ఎదుర్కొనడానికి పవన్ తయారుగా ఉన్నారా. ఆయన నిన్న బీజేపీ తో దోస్తి అన్న అనుమానాలు కలిగించారు, ఇపుడు కాంగ్రెస్ తో కలసి నడుస్తారా అన్నది కూడా అసక్తికరంగా ఉంది.  మోడీని ఢీ కొట్టడం అంటే గొప్ప విషయమే. ఈ విషయంలో పవన్ సక్సెస్ అయితే జనసేనానిని మరో స్థాయిలో చూడొచ్చు. అంతా ట్విట్టర్ ద్వారా స్పందించి వదిలేసిన సమస్యను పవన్ టేకప్ చేయడం మంచి పరిణామమే కానీ పవన్ ఎందాక దీన్ని తీసుకువెళ్తారన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: