నేను ఆశావాదిని, ఏమైనా రానీయ్ నా దారి ఒక్కటే. విజయతీరాలకు చేరడమే నా లక్ష్యం. దాని కోసం నేను ఆశగా ఎందాకైనా వెళ్తాను... ఇదీ తమ్ముళ్లకు చంద్రబాబు చెప్పే మాటలు. పాజిటివ్ మూడ్ లో పార్టీని తీసుకెళ్ళాలన్న బాబు ఆశలకు, ఆశయాలకు గండి పడుతోందా. బాబు అంటేనే చాణక్యుడు అంటారు. సవాళ్లు ఎదురైనపుడు ఆయన మెదడు ఇంకా చురుకుగా పనిచేస్తుందని చెబుతారు. నిజానికి టీడీపీ పుట్టె 2009 తరువాతే మునిగిపోయేది.


దాన్ని అయిదేళ్ల పాటు కాపాడి ఒడ్డుకు చేర్చిన ఘనత చంద్రబాబుదే. అటువంటి చంద్రబాబు ఇపుడు ఏటికి  ఎదురీదుతున్నారు. అయితే ఆయన పార్టీని మళ్లీ రీచార్జ్ చేయగలను అని గట్టిగా నమ్ముతున్నారు. టీడీపీ నుంచి నలుగురు ఎంపీలు వెళ్ళినపుడు బాబు పెద్దగా స్పందించలేదు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వంటి వారు కమలం నీడకు చేరితే పట్టించుకోలేదు. కానీ ఒకే ఒక్కడు బాబును నిలువెల్లా వణికించేశాడు.


ఆయనే గోదావరి జిల్లాలకు చెందిన సీనియర్ నేత తోట త్రిమూర్తులు. ఆయన బీజేపీలోకి వెళ్లలేదు, వైసీపీ బాట పట్టాడు, పోతూ పోతూ టీడీనీని ఘోరంగా విమర్శించారు. తోటలాంటి బలమైన నేత వైసీపీలో చేరిపోవడంతో ఇపుడు చంద్రబాబు కంగారు పడుతున్నారు. బీజేపీలోకి ఎంతమంది వెళ్లిపోయినా ఫరవాలేదు కానీ ఒక్కరు కూడా వైసీపీలో చేరకూడదు, ఇదీ బాబు పంతం. ఎందుకంటే వైసీపీ మరింత బలపడితే టీడీపీ దారుణంగా దెబ్బతింటుంది.


బీజేపీ ఏపీలో బలపడదు, అక్కడకు వెళ్ళిన వారు ఎపుడైనా వస్తారు, అదే వైసీపీలోకి క్యూ కడితే మాత్రం టీడీపీకి చిల్లుపడినట్లే. దగ్గరలో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఇపుడు చంద్రబాబు వణికిపోతున్నారు. వలసలను అడ్డుకోవడం ఎలా అని ఆయన మధనపడుతున్నారు. అయితే వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎంతో మంది టీడీపీ నుంచి వచ్చేందుకు రెడీగా ఉన్నారట. అదే కనుక జరిగితే బాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఖేల్ ఖతమే.


మరింత సమాచారం తెలుసుకోండి: