జగన్ వంద రోజుల పాలన ఏమాత్రం బాగా లేదని జాతీయ మీడియాకు చెందిన పలు పత్రికలు సంపాదకీయాలు రాయడం ఇప్పుడు పసుపు దళాల్లో ఆనందం నింపుతోంది. ఇప్పుడు ఆ సంపాదకీయాల పేరుతో జగన్ ను తప్పుబట్టేందుకు.. విమర్శించేందుకు ఎల్లో దళాలకు మంచి సాకు దొరికినట్టయింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అప్పుడే తన దాడి ప్రారంభించారు.


జగన్ పాలనపై దేశమంతా ఛీ కొట్టే పరిస్థితి తీసుకొచ్చారన్న చంద్రబాబు జాతీయ మీడియా కూడా జగన్ విధానాలను తప్పు పట్టిందని పేర్కొన్నారు. అమరావతి పై ప్రజల్లో కూడా చర్చ జరుగుతోందన్న చంద్రబాబు అమరావతి వ్యవహారంలో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. జగన్ వ్యక్తిత్వం తో రాష్ట్రంలో ఎవరూ సంతోషం గా లేరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీ నేతలతో అయన టెలికాన్ఫెరెన్సు నిర్వహించారు.


సొంత పార్టీ లోనే సీఎం తీరు పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోందని చంద్రబాబు నాయుడు తెలిపారు. రానున్న రోజుల్లో ఎవరూ బతకటానికి వీల్లేదు అన్నట్లు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మనకు ఓ నగరం అంటూ లేకపోతే బిడ్డల భవిష్యత్తు ఏంటి అనే ఆవేదన ఉందని ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రం పోవాలా అని భయపడుతున్నారని తెలిపారు.రేపు ఇతర రాష్ట్రాల్లో కూడా 75శాతం స్థానికులకే ఉద్యోగాలు అని నిర్ణయం తీసుకుంటే మన వారి పరిస్థితి ఏమిటి అనే భయాందోళన ప్రజల్లో ఉందని చంద్రబాబు వివరించారు.


జగన్ మూర్ఖత్వంతోనే ఈ పరిస్థితి ఎదురవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసారు.రాష్ట్రానికి ఆదాయ మార్గం ఎలా అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు కలిసి ఉండాలన్నా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి అన్న రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.ఉద్దేశపూర్వకంగా నే తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు పెట్టారన్న అయన ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి కలసికట్టుగా పోరాడుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: