కేసీఆర్ త్వరలోనే సీఎం పగ్గాలు తన కుమారుడు అందిస్తారని.. ఆయన జాతీయ రాజకీయాలకు వెళ్తాడని గతంలో అనేక విశ్లేషణలు వచ్చాయి. అందుకే కేటీఆర్ కు పార్టీ పగ్గాలు కూడా ముందుగానే అప్పగించారని అంతా అనుకున్నారు. కానీ.. అలాంటిదేమీ లేదట.. ఇప్పుడు.. మళ్లీ కూడా ఆయనే సీఎం అవుతాడట. ఈ విషయాన్ని నిండు అసెంబ్లీలో కేసీఆరే కుండబద్దలు కొట్టారు.


అసెంబ్లీలో ఆయన ఈ విషయంపై ఆసక్తికరంగా మాట్లాడారు.. తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్లను సీఎం కేసీఆర్ ఖండించారు. తన హెల్త్ భేషుగ్గా ఉందని, ఈ టర్మ్ తో బాటు మరో పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆదివారం మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం తన వయస్సు 66 ఏళ్ళని, మరో పదేళ్లు పని చేయలేనా అని ప్రశ్నించారు. కేటీఆర్ ని ఇప్పుడే సీఎం చేస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తొసిపుచ్చారు.


సీఎం ఈ పదవిని నేను కేటీఆర్ కు అప్పగిస్తానా ? ఎందుకలా చేస్తాను ? నాకు ఆరోగ్యం బాగా లేదని, అమెరికా వెళ్తానని ప్రచారం చేస్తున్నారు. కానీ నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను.. మరో పదేళ్లు ముఖ్యమంత్రిని నేనే.. టీఆరెస్ మూడు దఫాలు అధికారంలోకి వస్తుంది ‘ ఎవరెన్ని శాపాలు పెట్టినా నాకేం కాదు. ఇంకా రెండు పర్యాయాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా.. అని శాసనసభలో ముఖ్యమంత్రి అన్నారు.


రెండు రాష్ట్రాల నీటి సమస్యపై కూడా కేసీఆర్ మాట్లాడారు. ఏపీలో నీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకొనేందుకు ఆంధ్రా సీఎం జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ సహాయ సహకారాలు కోరారన్నారు. రెండు రాష్ట్రాల రైతుల అభ్యున్నతి కోసం తాము కూడా పాత పంచాయితీలను పక్కన పెట్టి కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యామన్నారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా ఏపీతో కలిసి గోదావరి-కృష్ణా అనుసంధానానికి సిద్ధమయ్యామని కేసీఆర్ వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: