ప్రపంచంలో ఏమోగాని, దేశంలో అపరకుబేరుల్లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే.. ఖచ్చితంగా ముఖేష్ అంబాని అని చెప్తాం.  రిలయన్స్ గ్రూప్ అధినేతగా ఉన్న ఈయన ఎన్నో సౌజన్యంలో ఎన్నో వ్యాపార సంస్థలు నడుస్తున్నాయి.  రిలయన్స్ పెట్రోలియం, గ్యాస్, చమురు శుద్ధి సంస్థ ఇలా ఎన్నో ఎన్నెన్నో కంపెనీలు ముఖేష్ అంబాని సొంతం.  దేశంలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబాని జీవితం కూడా అంటే విలాసవంతంగా ఉంటుంది.  ముంబైలో 27 అంతస్తులతో కూడిన విలాసవంతమైన భవంతిలో ముఖేష్ కుటుంబం నివసిస్తుంది.  దాదాపు 4 వేల కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించారు.  మొదటి నాలుగు ఫ్లోర్లు కేవలం కార్ల పార్కింగ్ కోసమే వినియోగిస్తారు అంటే అర్ధం చేసుకోవచ్చు.  


ప్రపంచంలో విలాసవంతమైన ప్రతి కారు ఆయన కాంపౌండ్ లో ఉంటుంది.  ఒక్కో ఫ్లోర్ లో 160 కార్లు పార్కింగ్ చేసే సౌకర్యం ఉంది.  ఇక అధునాతన హోమ్ థియేటర్స్, అద్బుతమైన స్విమ్మింగ్ పూల్స్ ఈ ఆంటెల్లా లో ఉన్నాయి.  ఇక ఇంటిపైన అధునాతనమైన హెలిప్యాడ్ ఉందట.  మూడు హెలికాఫ్టర్లు ఇక్కడ ల్యాండ్ అవ్వొచ్చు.  ఈ ఇంటికోసం ఏకంగా ఒక ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ నిర్మించారు అంటే అర్ధం చేసుకోవచ్చు ఎంత విద్యుత్ ను వినియోగిస్తారో.  


మరి ఇంతటి విలాసవంతమైన ఈ ఇంట్లో పనిచేసేవాళ్లకు జీతాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిస్తే నిజంగా షాక్ అవ్వడం గ్యారంటి.  ముఖేష్ అంబాని పర్సనల్ కార్ డ్రైవర్ కు ఏకంగా నెలకు రెండు లక్షల రూపాయల జీతం ఇస్తారట.  వీటితో పాటు ఇతర అలవెన్సులు అదనం.  అంటే కార్పోరేట్ కంపెనీ జనరల్ మేనేజర్ కు ఇచ్చే జీతంతో సమానమైన జీతం అన్నమాట.  అంతేకాదు, ఈ ఇంట్లో ఆరు వందల నుంచి వెయ్యి వరకు పనివాళ్ళు ఉంటారట.  కుకింగ్ డిపార్ట్మెంట్ లో చేసే కుక్ లకు లక్షల్లో జీతం అందిస్తారట.  ఇంత జీతాలు ఇంత భారీగా ఉన్న ఈ ఇంట్లో ఎంత మంది ఉంటారని ఆశ్చర్యపోతున్నారా.. ఆంటెల్లాలో కేవలం ఐదుగురు మాత్రమే ఉంటారు.  ఈ ఐదుగురు నివసించే ఈ ఇంటికి నెలకు ఎంత లేదన్నా కోటికి పైగానే ఖర్చు అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: