ఏపీలో వైసీపీ ప్రభుత్వం రాగానే.అవినీతిలేని పాలన అందిస్తామనిప్రకటించింది.అందుకు తగ్గట్టుగానే,ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు,పనుల విషయంలో మళ్లీ స్టార్ట్ చెయ్యాలనే అలోచనతో అడుగులు వేస్తోంది.పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ రివర్స్ టెండరింగ్‌కి వెళ్లి.కోర్టులో చుక్కెదురయ్యేలా చేసుకుంది.ఇక రాజధాని అమరావతి విషయంలోనూ ఇదే ఫార్ములాను అప్లై చేస్తోంది.గత టీడీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందంటున్న వైసీపీ సర్కార్.వాటన్నింటినీ వెలికి తీసే పనిలో వుంది.అదే సమయంలో అసలు రాజధానిగా అమరావతి పనికిరాదంటున్న వైసీపీ నేతల కామెంట్లతో,ప్రస్తుతానికి అమరావతి నిర్మాణం అటకెక్కినట్లేననే వాదన బలంగా వినిపిస్తున్న సమయంలో అగ్నికి ఆజ్యం తోడైనట్లు కేసీఆర్ మాటలు ఇప్పుడు మరో సారి సంచలనానికి దారి తీస్తున్నాయట..?



ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యల్లో అమరావతి నిర్మాణం ఓ‘డెడ్‌ ఇన్వ్వెస్ట్‌మెంట్’గా అభివర్ణించారు.అమరావతి నిర్మాణం వేస్టని అప్పుడే చంద్రబాబుకు తాను తెలిపానని ఆదివారం ఆయన తెలంగాణ శాసనసభలో ఎత్తిపోతలకు కరెంటు బిల్లులపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.ఎత్తిపోతల కరెంటుపై కొందరు ఎత్తిపొడిచారు.ఇక జయప్రకాశ్‌ నారాయణ,ఆయనెవరో నాకు అర్థం కాలేదు.ఆయనేదో పెద్ద కత చేసి స్టేట్‌మెంట్‌ ఇచ్చిండు.ఆయనకేం అవసరం.ఔరోకి షాదీమే అబ్దుల్లా బేగానా అన్నట్లు ఆయనది మన రాష్ట్రంకాదు,మన మన్నుకాదు.బాధ కలుగుతుంది అధ్యక్షా,ఇదంతా వేస్టు అంటడు ఆయన.పక్క రాష్ట్రంలో రూ.53 వేల కోట్లతో అమరావతి కడుతుంటే దాన్ని డప్పు కొడతా నంటాడు.అహో,ఓహో అని,అమరావతిని పొగుడుతాడు.ఇక ఆ చంద్రబాబు నాయుడికి ఆనాడే చెప్పా.అమరావతి కట్టకయ్యా వేస్టు అని.రాయలసీమకు నీళ్లు తీసుకుపో అని చెప్పా అయినా ఎవ్వరి మాట వినకుండా కట్టిండు.ఆ తర్వాత ఎల్లకిలాబడ్డడు.ఇప్పుడు దాని పరిణామం ఏంటో తెలిసింది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారట.?



ఇక అమరావతిపై జగన్ సర్కారు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన తరుణంలో.రాజధానిని మారుస్తారనే ప్రచారం జరుగుతోన్న సమయంలో.జగన్‌కు సన్నిహితంగా ఉండే తెలంగాణ సీఎం కేసీఆర్.అమరావతిపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ప్రాధాన్యం కాదని ఇప్పటికే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇలాంటి సమయంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎంతగానో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: