నిన్న మొన్నటివరకు అతివలకు నిద్రలేకుండ చేసిన బంగారం ధరలు కాస్త తగ్గుతున్నాయి అని సంతోష పడుతున్న సమయంలో పసిడి ధర పతనానికి మరోసారి బ్రేకులు పడి మళ్లీ హర్ట్‌బీట్ పెంచుతుందా అనేలా స్వల్పంగా పెరిగింది.ఆ వివరాలేంటో తెలుసుకుందాం.హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్వల్పంగా రూ.10 పెరుగుదలతో రూ.39,100కు చేరింది.గ్లోబల్ మార్కెట్‌లో బలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు,రిటైలర్ల నుంచి ప్రస్తుతం,డిమాండ్ కొద్దిగా పుంజుకోవడంతో బంగారం ధరపై సానుకూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.



అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.35,850కు చేరింది.ఇక బంగారం ధర స్వల్పంగా పెరిగితే..నాకేంటి తక్కువ అన్నట్లు పెరిగిన వెండి ధర మాత్రం భారీగాపతనమైంది.కేజీ వెండి ధర ఏకంగా రూ.2,540 పతనమై రూ.48,760కు పడిపోయింది.పరిశ్రమ యూనిట్లు,నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌‌ క్షీణించడం ఇందుకు కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.ఇక విజయవాడ,విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.ఇదే సమయంలో గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పరుగులు పెడుతోంది.పసిడి ధర ఔన్స్‌కు 0.98 శాతం పెరుగుదలతో 1,514.35 డాలర్లకు ఎగసింది.



అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 2.32 శాతం పెరుగుదలతో 17.98 డాలర్లకు చేరింది.ఇక ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరుగుదలతో రూ.37,810కు చేరింది.ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.10 పెరుగుదలతో రూ.36,610కు ఎగసింది.ఇక కేజీ వెండి ధర భారీగా దిగొచ్చింది.రూ.2,540 తగ్గుదలతో రూ.48,760కు పడిపోయింది.ఇక నిన్న మెన్నటి వరకు భగ్గుమన్న బంగారం ధరలు కొంత ఊరట కలిగించాయని అనుకొంటున్న నేపధ్యంలో బంగారం ధరలు మళ్లీ షాక్ ఇవ్వడానికి రెడి అవుతున్నాయా అనే అనుమానం వినియోగదారుల్లో మొదలవుతుందట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: