ఈ విశ్వంలో మానవ ఆవాసయోగ్యమైన ప్రాంతం భూమి తప్పించి మరొకటి లేదు.  భూమిపై ఇప్పటికే 700కోట్ల మందికిపైగా ప్రజలు జీవిస్తున్నారు.  ఈ సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉన్నది.  పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా భూమి ఉండటం లేదు.  దీంతో భూమిపై ఉన్న అడవులను కొట్టేసి.. ఆవాసానికి అనువుగా మారుస్తున్నారు.  ఇలా చేయడం వలన మనిషి మనుగడకే ప్రమాదం రావొచ్చు.  


భూమిపై వస్తున్న వాతావరణ మార్పుల కారణంగా కొంతమేర ఇబ్బందులు వస్తున్నాయి.  ఎప్పుడు ఎక్కడ ఎలాంటి  మార్పులు వస్తాయో తెలియక నిత్యం అలర్ట్ గా ఉంటున్నారు.  భూమికి ఊపిరితిత్తులుగా చెప్పుకునే అమెజాన్ అడవులు ఇటీవల కాలంలో అగ్నికి బలయ్యాయి.  పైగా భూమిపై కాలుష్యం దారుణంగా పెరిగిపోతున్నది.  ఈ కాలుష్యంతో నానా ఇబ్బందులు పడుతున్నారు.  


ఒకవైపు భూమిపై ఇలాంటి ఇబ్బందులు ఉంటె, ఆకాశంలోని కొన్ని గ్రహశకలాలు భూమిని డీకొట్టేందుకు దూసుకువస్తున్నాయి.  మూడు రోజుల క్రితం 2010 సి 0 1 అనే గ్రహశకలం భూమివైపు దూసుకు వచ్చింది.  అయితే, భూవాతావరణంలోకి ప్రవేశించగానే దాని దిశ మారింది.  దీంతో  తప్పింది.  దాదాపు 260 మీటర్ల పరిమాణం ఉన్న ఆ గ్రహశకలం భూమిని ఢీకొట్టి ఉంటె మరోలా ఉండేది. 


ఇదే కాదు మరో గ్రహశకలం కూడా భూమివైపు దూసుకొస్తున్నట్టు నాసా తెలిపింది. 2000 క్యూ డబ్ల్యూ 7 అనే గ్రహశకలం భూమివైపు దూసుకొస్తున్నట్టు నాసా పేర్కొన్నది.  అయితే, ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించిన తరువాత దిశ మార్చుకునే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.  సాధారణంగా ఇలాంటి గ్రహశకలాలు భూమిని ఢీకొట్టవని.. చాలా రేర్ గా అలా జరుగుతుంటుందని అంటున్నారు. గతంలో బీహార్ లో ఇలాంటి శకలం ఒకటి పంటపొలాల్లో పడింది.  అదృష్టవశాత్తు ఎవరికీ ఏమి కాలేదు.  జురాసిక్ యుగంలో గ్రహశకలాలు ఢీకొట్టడం వలనే భూమిపై డైనోసార్స్ లు అంతమయ్యాయి అనే విషయం అందరికి తెలిసిందనే. 


మరింత సమాచారం తెలుసుకోండి: