తెలుగు దేశం పార్టీ ఓ పార్టీ కాదు.. అది ఇప్పుడు ఓ అక్రమ వ్యాపార సంస్థ.. ఇలా ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.. గతంలో ఆ పార్టీలో పని చేసిన ఆయన ఎన్నికల ముందు వైసీపీలో చేరిన సంగతి తెలిందే. ‏తెలుగుదేశం పార్టీ ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయిందని ఆమంచి కృష్ణమోహన్ అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైఎస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు


చంద్రబాబు టిడిపిని కుల పార్టీగా మార్చివేశారని.. దాంతోనే మిగిలిన కులాలన్ని ఆ పార్టీని వ్యతిరేకించాయని ఆమంచి కృష్ణ మోహన్ అన్నారు. టిడిపి రాజకీయ పార్టీగా కాకుండా ఒక వ్యాపార పార్టీగా మార్చారని, దాని ద్వారా నేతలు వీలైనంత దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. త్రిమూర్తులు చేరిక ఆరంభం మాత్రమేనని, అనేక మంది రావడానికి సిద్దంగా ఉన్నారని, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే రావాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పడంతో టిడిపి ఎమ్మెల్యేలు రాలేకపోతున్నారని ఆయన అన్నారు.


జగన్ నాయకత్వంపై ప్రజలలో విశ్వాసం పెరుగుతోందని ఆయన అన్నారు. ఆమంచి కృష్ణ మోహన్ పవన్ వ్యాఖ్యలపైనా స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వైస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తప్పు. తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. కాపులే కాదు అన్ని సామాజిక వర్గాలు వైస్సార్‌సీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.


సామాజిక న్యాయం జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యం. సిగ్గులేకుండా చంద్రబాబు తన పార్టీ వాళ్ళను బీజేపీలోకి పంపుతున్నారు. చంద్రబాబు వెనుక ఉన్న వాళ్లు ఉత్తుత్తి నాయకులే. మేము దేనికి ఆశపడి పార్టీలో చేరలేదు. టీడీపీ అనేది అక్రమ వ్యాపార సంస్థ... అంటూ విరుచుకుపడ్డారు ఆమంచి కృష్ణ మోహన్. ఆమంచి గతంలోనూ చంద్రబాబుపై విమర్శలు చేసినా.. ఈ రేంజ్ లో విరుచుకుపడటం టీడీపీ నేతలను కూడా ఆలోచనలో పడేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: