ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిపోయాయి.  దేశంలో ఎలాంటి చట్టాలను అమలులో ఉన్నాయో అలాంటి చట్టాలే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో అమలు చేయబోతున్నారు.  ఈ చట్టాల అమలుతో పాటు జమ్మూ కాశ్మీర్ కు కొన్ని ప్రత్యేకమైన వరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఏడేళ్లపాటు జమ్మూ కాశ్మీర్ కు టాక్స్ ఫ్రీ కల్పించారు.  దీంతో అక్కడ ఏడు సంవత్సరాల పాటు టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 


దీంతో పాటు రెండు నెలల్లో 50 వేల ఉద్యోగాల కల్పన చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.  దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.  మరో కొన్ని రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడబోతున్నాయి.  వీటితో పాటు, మరిన్ని వరాలు కూడా జమ్మూకాశ్మీర్ కేంద్రం ప్రకటించింది.  జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం ఓ బ్లూ ప్రింట్ ను ఏర్పాటు చేసింది.  దీనిప్రకారం అక్కడ నివసించే ప్రజలకు ఉపాధి కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోబోతున్నారు.  


మెరుగైన జీవన విధానం కోసం చర్యలు తీసుకుంటున్నారు.  పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి చాలా కుటుంబాలు కాశ్మీర్ కు వలస వచ్చాయి.  అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అక్కడ నివసించలేకపోతున్నామని చెప్పి కాశ్మీర్ వచ్చిన కుటుంబాలు ఉన్నాయి.  ఆర్టికల్ 370 రద్దు ముందు వరకు వారికోసం అక్కడి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు.  కానీ, ఆర్టికల్ 370 రద్దు తరువాత వారికోసం కోసం ప్రభుత్వం కొన్ని పధకాలు ప్రవేశపెట్టి వారిని మెరుగైన జీవితాన్ని కల్పించేందుకు సిద్ధం అవుతున్నది.  


పీవోకే నుంచి వచ్చిన వాళ్లకు మెరుగైన జీవితాలు కల్పిస్తే.. ఫలితంగా పీవోకే లో ఉన్న ప్రజలు కూడా ఇండియాలో జీవించడానికి ఆసక్తి చూపుతారు.  ఆ విధంగా కూడా పాక్ పై ఒత్తిడి పెరుగుతుంది.  ఇప్పటికే పీవోకే విషయంలో ఇండియా ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  పాక్ తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని, ఒకవేళ పాక్ తో చర్చలు జరపాలి అంటే అది పీవోకే విషయంలో మాత్రమే జరుపుతామని ఇండియా స్పష్టం చేసింది.  పాక్ మాత్రం పీవోకే ను అప్పగించే ప్రసక్తి లేదని, అవసరమైతే యుద్ధం చేస్తామని అంటోంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: