చెన్నైకు చెందిన ఒక యువతి ప్రేమించిన వ్యక్తి విదేశాలకు వెళ్లటం కొరకు 10 లక్షల రుపాయలు అవసరం కావటంతో కిడ్నాప్ డ్రామా ఆడి తండ్రిని 10 లక్షల రుపాయలు డిమాండ్ చేయించింది. చెన్నైలోని కృష్ణగిరికి చెందిన ఆర్ముగం వృత్తిరిత్యా తెలంగాణలోని ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆర్ముగంకు ఒక కుమారుడు విఘ్నేష్, కుమార్తె విద్య ఉన్నారు. కూతురు విద్య చెన్నైలో ఒక హాస్పిటల్ లో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. 
 
విద్య మనోజ్ అలియాస్ సురేష్ బాబు అనే వ్యక్తి కొంతకాలం నుండి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. సురేష్ ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలని అనుకున్నాడు. విదేశాలకు వెళ్లటం కొరకు సురేష్ కు 10 లక్షల రుపాయలు అవసరమయ్యాయి. ఈ విషయం తెలిసిన విద్య తన తండ్రి దగ్గర ప్లాటు అమ్మిన డబ్బులు ఉన్నాయని కిడ్నాప్ డ్రామా ఆడి ఆ డబ్బును తండ్రి దగ్గరనుండి రాబడదామని పథకం రచించింది. 
 
పథకంలో భాగంగా విద్య తన స్నేహితురాలి సోదరి పెళ్లి ఉందని పెళ్లికి వెళుతున్నానని తండ్రికి చెప్పింది. ఆ తరువాత విద్య తన మొబైల్ స్విచాఫ్ చేసింది. ఆ తరువాత సురేష్ విద్య తండ్రికి ఫోన్ చేసి విద్యను కిడ్నాప్ చేశానని, పది లక్షలు ఇస్తేనే విద్యను విడిచిపెడతానని చెప్పాడు. ఆ తరువాత విద్య తన తండ్రితో బస్టాండ్ లో ఉండగా ఎవరో కిడ్నాప్ చేశారని చిత్రహింసలకు గురి చేస్తున్నారని సురేష్ ఫోన్ నుండి మాట్లాడింది. 
 
విద్య అన్నకు కూడా కాల్ చేసి విద్యను కిడ్నాప్ చేశానని 10 లక్షలు ఇస్తే విడిచిపెడతానని సురేష్ చెప్పాడు. ఆర్ముగం చెన్నై చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కడలూరు అనే ప్రాంతంలో కాల్ చేసిన వ్యక్తి మొబైల్ సిగ్నల్స్ ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు కడలూరుకు చేరుకుని సురేష్ ను విచారించగా నిజాలు తెలియటంతో సురేష్, విద్య మరియు కిడ్నాప్ కు సహకరించిన విద్య స్నేహితురాలు అక్షయను అరెస్ట్ చేశారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: