నిజంగా చంద్రబాబుకు ఎంత కష్టమోచ్చిందో ఈ వయసులో కూడా. ప్రభుత్వంలో ఉన్నపుడు ప్రత్యర్ధులపై ఒంటరి పోరే చేశారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ఒంటరిపోరు కంటిన్యు చేస్తున్నారు. అంటే చంద్రబాబుది ఎప్పుడైనాన ఒంటరిపోరే అని అర్ధమైపోతోంది.

 

నిజానికి చేతికంది వచ్చిన కొడుకు నారా లోకేష్ ఉన్నా అది చెప్పుకోవటానికి మాత్రమే పనికొస్తాడు. లోకేష్ పాండిత్యం ఏపాటిదో ఇప్పటికే లోకానికి అంతా తెలుసు. బహిరంగ సభల్లో రెండు నిముషాలు కూడా తప్పులు లేకుండా మాట్లాడలేడు. ఘోర ఓటమి తర్వాత ట్విట్టర్ కు మాత్రమే పరిమితమైపోయిన లోకేష్ ట్వీట్లలో కూడా అనేక తప్పులుంటున్నాయంటే ఏమిటర్ధం ?


ఇక నేతలను కలుపుకుని వెళ్ళే సామర్ధ్యం లేదని ఇప్పటికే అనేకసార్లు రుజువైపోయింది. అందుకనే చాలామంది సీనియర్ నేతలకు లోకేష్ తో పడటం లేదు. ఎందుకంటే ఏ ఒక్క విషయంలో కూడా పట్టు లేకపోయినా అన్నీ విషయాలు తనకే తెలుసన్నంత బిల్డప్ ఇస్తుండటాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటి పార్టీ ఓటమికి లోకేష్ కూడా ఓ కారణమనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఈ దశలో నాయకత్వాన్ని అప్పగిస్తే ఇపుడున్న వాళ్ళు కూడా వెంటనే వెళ్ళిపోతారని చంద్రబాబు భయ పడుతున్నారట. ఎందుకంటే లోకేష్ నాయకత్వంలో పనిచేయటానికి ఎవరూ సిద్ధంగా లేమని చెప్పేశారట.


ప్రతిపక్షంలోకి వచ్చిన మూడు నెలల్లో కూడా ఏ చిన్న విషయమైనా మొత్తం చంద్రబాబే చూసుకుంటున్నారు కానీ లోకేష్ మాత్రం ఎక్కడా లీడ్ తీసుకోవటం లేదు.  పైగా పెయిడ్ ఆర్టిస్టులను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రంగంలోకి దింపి పార్టీ పరువును కృష్ణా నదిలో కలిపేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఎన్టీయార్ ట్రస్టు భవన్లో కూడా చంద్రబాబు ఒక్కరే వచ్చారు కానీ లోకేష్ మాత్రం ఎక్కడా కనబడలేదు. అందుకే ఈ వయసులో కూడా చంద్రబాబుకు ఎంత కష్టం వచ్చిందని పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: