బంగారం ధర గత పది రోజులుగా భారీగా తగ్గుతూ వస్తుంది. రోజుకు రెండు వందలు మూడు వందలు తగ్గుతూ నిన్నటికి 2,800 తగ్గింది. ఈరోజు ఏకంగా 1000 రూపాయిలు తగ్గి పసిడి ప్రియులకు ఉరతినిస్తుంది. బంగారం రేటు ఇంత తగ్గిందా ? వెళ్లి కొనేయాలి అంటూ పసిడి ప్రియులు తొందర పడుతున్నారు. ఏంటి అంత చెప్పి రేటు చెప్పలేదు అని అనుకుంటున్నారా ?                       


చెప్తున్నా.. ప్రస్తుతం మార్కెట్లో బంగారు ధర 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.37,200లుగా ఉంది. ఇంకా 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 35,200 రూపాయిలుగా ఉంది. అంటే 24 క్యారెట్స్ బంగారం ధరపై 1000 రూపాయిలు, 22 క్యారెట్స్ పై 500 రూపాయిలు తగ్గింది. కేవలం 10 రోజుల్లోనే దాదాపు 3,900 వరుకు తగ్గింది.                                  


అంటే 24 క్యారెట్స్ తో ఒక గ్రాము రూ.3,720లు కాగా 22 క్యారెట్స్ ఓకే గ్రాము బంగారం ధర రూ. 3200 రూపాయిలుగా ఉంది. వెండి ధర కూడా 48,000 రూపాయిలు పడిపోయింది. అంటే ఈ లెక్కన చూస్తే బంగారం, వెండి ప్రియులకు మంచి రోజులు వచ్చాయి అన్నమాట. ఏది ఏమైనా గత నెల భారీగా పెరిగి ఇప్పుడు ఊరట నిస్తుంది. డిమాండ్ లేక బంగారం ధరలు తగ్గుముఖం పడితే పెట్రోల్, డీజల్ ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి.                         



మరింత సమాచారం తెలుసుకోండి: