గోదావరి నది  ప్రమాదంలో చనిపోయిన వారిలో చాలామంది లాంచిలోనే ఇరుక్కుపోయుంటారా ? లాంచి ప్రమాదంలో గల్లంతయిన వారి కోసం గాలిస్తున్న బృందాలకు పెద్దగా ఉపయోగం కనబడటం లేదు. దేవిపట్నంకు సమీపంలోని కచ్చులూరు దగ్గర ఆదివారం మధ్యాహ్నం 71 మంది పర్యాటకులతో వెళుతున్న లాంచి ముణిగిపోయిన విషయం తెలిసిందే.

 

నిజానికి లాంచిలో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే విషయం ఉన్నతాధికారుల దగ్గరే సరైన సమాచారం లేదు.  అధికారికంగా కొందరిని అనధికారికంగా మరి కొందరిని లాంచీల యజమానులు  లాంచీల్లోకి ఎక్కిస్తారనే విషయం బహిరంగ రహస్యమే. ప్రమాదమేమీ జరగనంత వరకూ ఎటువంటి సమస్యా ఉండదు. ఏదైనా ప్రమాదం జరిగినపుడే సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముడుతాయి. ఇపుడు జరిగిందదే.

 

లాంచీలో ఎంతమంది ప్రయాణిస్తున్నారో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారంటే ఏమిటర్ధం ?  ఇప్పటి వరకూ 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరో 47 మంది ఆచూకీ లభించలేదు. అంటే కొన్ని వందల కిలోమీటర్లున్న గోదావరి ఒడ్డున వెతకటమంటే చిన్న విషయం కాదు. అందుకే ఓఎన్జిసీ, ఎన్డిఆర్ఎఫ్ బృందాలను వెతుకులాట కోసం ప్రభుత్వం రంగంలోకి దింపింది.

 

ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో పాటు వందల కిలోమీటర్ల దూరంలో ఎవరెక్కడ తగులుకున్నారో కూడా ఆచూకి పట్టుకోవటం తలకు మించిన పని అనే చెప్పాలి. అది కాకుండా చాలామంది ముణిగిపోయిన లాంచిలోనే ఇరుక్కుని పోయుండచ్చని కూడా అనుమానిస్తున్నారు. మొత్తానికి 315 అడుగుల లోతులో ముణిగిపోయిన లాంచిని మాత్రం కనుక్కున్నారు.

 

లాంచిని గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన వారు కూడా లాంచిలోనే ఇరుక్కుపోయుంటారని అనుమానిస్తున్నారు. 315 అడుగుల లోతులో ఇరుక్కుపోయిన లాంచిని బయటకు తీయటమంటే చాలా శ్రమతో కూడుకున్న విషయం. అయినా సరే లాంచిని బయటకు తీసే ప్రక్రియను మొదలుపెట్టారు. లాంచి బయటపడితే కానీ మృతదేహాల విషయం తేలదని అర్ధమవుతోంది.

 

విచిత్రమేమిటంటే ప్రమాదం సమయంలో ఈత రాని వారితో పాటు వచ్చిన వాళ్ళు కూడా మరణించటం. అంటే ప్రవాహ వేగం ఏ స్ధాయిలో ఉందో అర్ధం అవుతోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: