ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో కొద్దిసేపటి క్రితమే ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. అత్యంత నాటకీయ పరిస్థితుల మధ్య ఈయన ప్రాణాలు వదలడం జరిగింది. గత కొద్ది రోజులుగా హాస్పిటల్ పాలైన కోడలా నేడు ఆత్మహత్యకు పాల్పడగా.... అతనికి ఊపిరి ఆందకపోవడంతో వెంటిలేటర్ పై డాక్టర్లు ఆయనని బతికించేందుకు చాలా ప్రయత్నించారట.  చివరికి వారు చేసిన ప్రతీ ఒక్క ప్రయత్నం విఫలం కాగా ఆయన తన తుది శ్వాసను విడిచారు.

కొద్దిరోజుల ముందే ఆయనపై అసెంబ్లీలోని ఫర్నిచర్ ను తన ఇంటికి తరలించుకున్నారని ఆరోపణలుగా పోలీసులు మరియు అసెంబ్లీ అధికారులు అతని ఇంటి నుండి ఆ సామాగ్రి మొత్తం రికవరీ చేశారు. తర్వాత అతని కొడుకు షాపు పై కూడా రైడ్ జరిపి ఎన్నో కుర్చీలను మరియు ఇతర ఫర్నిచర్ ను రికవరీ చేసి వారిద్దరిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కోడెల ఆరోగ్య పరిస్థితి మరీ క్షీణించి ఛాతి నొప్పి మరియు గుండె పోటుతో గుంటూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత ఇంకా మెరుగైన వైద్య సహాయం కోసం హైదరాబాద్ లోని ఒక హాస్పిటల్ లో కూడా చేరినట్లు కూడా తెలిసిందే.

అయితే గత కొద్ది రోజులుగా కోడెల ఆరోగ్య పరిస్థితి క్షీణించింది అని అంటూ ఉన్నరు. కానీ అతని గురించి ఒక్కసారిగా అతను ఆత్మహత్య చేసుకోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్యం బాగా లేని మనిషి గుండె పోటు వల్లో లేదా వేరే ఏ కారణంగానైనా మరణిస్తే ఏమి కాదు కాని ఒక్కసారిగా ఆత్మహత్యకు పాల్పడడం వల్ల ఎన్నో కొత్త అనుమానాలకు దారి తీస్తోంది. ఏదేమైనా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది... ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన ఈయన మృతి ఏపీ రాజకీయాలకు తీరనిలోటు.


మరింత సమాచారం తెలుసుకోండి: