టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, మాజీ స్పీక‌ర్‌, ఏపీలో విభిన్న రాజ‌కీయాల‌కు పెట్టింది పేరైన కోడెల శివ‌ప్ర‌సాద‌రావు.. ఈ లోకాన్ని వీడిపోయారు. అనూహ్య రీతిలో ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. త‌ను ఉం టున్న నివాసంలోనే హైద‌రాబాద్‌లో ఆత్మ‌హ‌త్యకు ఒడిగ‌ట్టిన ఆయ‌న సోమ‌వారం ఉద‌య‌మే అనంత వా యువుల్లో క‌ల‌సిపోయారు. అయితే, ఆయ‌న వైద్యుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా భిన్న‌మైన శైలిని అవలం బించారు. తాను బ‌తుకుతూ.. మ‌రొక‌రికి బ‌తుకునివ్వ‌డం అనే సూత్రాన్నితు.చ‌. త‌ప్ప‌కుండా అమ‌లు చేసిన కోడెల‌కు అనేక మంది శిష్యులు ఉన్నారు.


వైద్య వృత్తి నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన తెలుగు వారిలో బ‌హుశ కోడెలతోనే ఈ ప‌రంపర ప్రారంభ‌మై ఉం టుంది. టీడీపీతో మొద‌లైన రాజ‌కీయ ప్ర‌స్థానంలో కోడెల వేసిన ప్ర‌తి అడుగూ ఆద‌ర్శం దిశ‌గానే ముందుకు సాగింది. వైద్యుడిగా ఒక‌ప‌క్క విరామం లేని వృత్తిని కొన‌సాగిస్తూనే మ‌రోప‌క్క రాజ‌కీయాల్లో దూసుకుపోయారు. ముఖ్యంగా టీడీపీలో ఆయ‌న ఓ అజాత శ‌త్రువు, అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం, అంద‌రినీ స‌మానంగా గౌర‌వించ‌డం వంటివి కోడెల‌కు రాజ‌కీయంగా అబ్బిన విద్య‌లు. ఇక‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు అంటే కోడెల అమిత‌మైన గౌర‌వం. ఆయ‌నను సీఎం సార్ అనే గౌర‌వంగా పిలిచే కోడెల‌.. ఆయ‌న‌లా తాను క‌ష్ట‌ప‌డ‌లేన‌ని ఓ స‌భ‌లో చెబుతూనే బాబుపై త‌న‌కున్న అభిమానాన్ని చాటుకున్నారు.


అనేక విధాలుగా చంద్ర‌బాబుకు ఆయ‌న అండ‌గా నిలిచారు. పార్టీలో సంక్షోభం ఏర్ప‌డిన‌ప్పుడు కూడా ఆయ‌న బాబుకు మ‌ద్ద‌తిచ్చారు. బాబు వెంటే న‌డిచారు. గ‌త 2014 ఎన్నిక‌ల్లోనూ చంద్ర‌బాబు చెప్పిన‌ట్టే న‌డుచుకుని త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన న‌ర‌స‌రావుపేట ను వ‌దులుకుని అధినేత ఆదేశాల మేర‌కు స‌త్తెన‌ప‌ల్లి నుంచి పోటీ చేశారు. అదేస‌మ‌యంలో త‌న‌కు మంత్రి కావాల‌ని ఉన్నా.. సామాజిక వ‌ర్గాల స‌మీక‌ర‌ణ‌లో భాగంగా ఆయ‌న‌కు చంద్ర‌బాబు స్పీక‌ర్ ప‌ద‌విని ఇచ్చి స‌రిపెట్టిన‌ప్పుడ కూడా ఆయ‌న మౌనంగా ఉండిపోయారు. బాబు త‌న‌కు ఆద‌ర్శ‌మ‌ని వెల్ల‌డించారు. ఇలా త‌న‌కు, బాబుకు ఉన్న అనుబంధంపై కోడెల అనేక సార్లు చెప్పుకొచ్చారు. మొత్తానికి వీరి బంధం.. అనుబంధం టీడీపీలో చ‌రిత్ర‌.



మరింత సమాచారం తెలుసుకోండి: