Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 3:23 pm IST

Menu &Sections

Search

కోడెల చివరి రాత్రి ఎవరితోనైనా గొడవ పడ్డారా?

కోడెల చివరి రాత్రి ఎవరితోనైనా గొడవ పడ్డారా?
కోడెల చివరి రాత్రి ఎవరితోనైనా గొడవ పడ్డారా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కోడెల శివప్రసాదరావు కొన్నాళ్లుగా తీవ్ర మనస్థాపానికి గురయ్యారనేది సమాచారం. ఆయనకు ఇంటి పోరు ఎక్కువగా ఉందని అంటున్నారు. వారం రోజులుగా ఆయన కుమారుడితో వాదనలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. కుటుంబసభ్యుల మధ్య విపరీత పరిణామాలు జరిగాయా అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కాబట్టే ఆయన ఆత్మహత్య చేసుకున్నారా అనే దానిపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

  

ఆయన కుటుంబసభ్యుల మధ్య గొడవలు ఉన్నాయని, ఆయన ఇంట్లో ఉరి వేసుకున్నారని, పాయిజన్ ఇంజక్షన్లు తీసుకున్నారని, గుండెపోటుకు గురయ్యారని పలు వాదనలు వస్తున్నాయి. మరో వాదన ప్రకారం ఆయన ఇంట్లో ఉరి వేసుకోవడాన్ని చూసిన డ్రైవర్ వెంటనే కిందికి దింపగా అప్పటికే ఊపిరి తీసుకోవటానికి ఆయన ఇబ్బందిపడ్డారని అంటున్నారు. ఆయనను హాస్పిటల్ కు తీసుకొచ్చిన సమయంలో ఆయన డ్రైవర్, గన్ మెన్ మాత్రమే ఉన్నారని అంటున్నారు. ఆయన స్పీకర్ గా ఉన్న సమయంలోనే కుటుంబంలో కలహాలు ఉండేవని అంటున్నారు. అసెంబ్లీ ఫర్నీచర్ సొంత వాడకానికి తరలింపు విషయంలో ఆయన కుమారుడి పాత్ర ఉందని పలు వాదనలు ఉన్నాయి. ఈ ఫర్నీచర్ ఆయన కుమారుడుకు చెందిన గుంటూరులోని వాహనాల షోరూంలో లభించడమే ఉదాహరణ. గత మూడు నెలల కాలంలో ఆయన కుమార్తె, కుమారుడిపై నమోదైన కేసులు కూడా ఆయనపై తీవ్ర ప్రభావం చూపాయని అంటున్నారు.

  

తీవ్రమైన ఒత్తిడి, మానసిక వేదనతో ఆయన మృతి చెందారని అంటున్నారు. కోర్టు నోటీసులు ఇవ్వడం, బెయిల్ తెచ్చుకోవడం, కోడెల తప్పుంటే కేసులు పెట్టుకోండంటూ సొంత పార్టీ నుంచే వ్యాఖ్యలు రావడం వంటి పరిణామాలు ఆయన మృతికి కారణాలుగా చెప్తున్నారు. దీనిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. టీడీపీ వర్గాలు మాత్రం ఆయన్ను వైసీపీ ప్రభుత్వం మానసికంగా వేధించిందని అంటున్నారు.

kodela-family-clashes
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మనసున్న మారాజు.. అనిపించుకుంటున్న విజయ్ సేతుపతి
రష్మిక ఆ సినిమా నుంచి తప్పుకోలేదట.. తప్పించారట!
'మా'లో విబేధాలకు పరిష్కారం చూపేది ఆయనేనా!
'మా' సమావేశం రసాభస.. రాజీనామా చేస్తానంటున్న పృథ్వీ
ప్రభాస్..! చిరు, నాగ్, వెంకీలను ఫాలో అవ్వు.. నెటిజన్ల కామెంట్స్!
మోదీజీ.. సౌత్ సినిమాపై ఇదేనా మీ ప్రేమ: మెగా కోడలు ఉపాసన ట్వీట్
రాష్ట్ర బంద్ ప్రభుత్వానికి ఓ గుణపాఠం: టీఎస్ఆర్టీసీ జేఏసీ
కొనసాగుతున్న బంద్.. నాయకులు, కార్మికులు అరెస్ట్
శ్రీకాంత్ అడ్డాల మెగా ఛాన్స్ పట్టేశాడా..!
రౌడీ స్టార్ కొత్త సినిమా విడుదల ఆ ప్రత్యేక రోజునే!
త్రిషకు క్రేజీ ఆఫర్స్.. మళ్లీ మాయ చేయడం ఖాయమా..!
మెగాస్టార్ మాసివ్ హిట్ 'రౌడి అల్లుడు' కి 28 ఏళ్ళు
ఇకపై డెంగ్యూ, సీజనల్ వ్యాధులకూ ఆరోగ్యశ్రీ: సీఎం జగన్
కాబోయే భర్తలో అవన్నీ ఉండాలంటున్న రష్మిక
నన్నయ్య యూనివర్శిటీ ప్రొఫెసర్ అరెస్టు
చిరంజీవి 152వ సినిమాపై అఫీషియల్ న్యూస్.. ఇదే
ఈ డైరెక్టరైతేనే బెటర్ అంటున్న పవన్ ఫ్యాన్స్
ప్రస్తుతం టాలీవుడ్ లో పోటీ ఈ హీరోయిన్ల మధ్యేనా!
చిరంజీవికి మోహన్ లాల్ చేసిన మరో సాయం ఇదే!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.