పల్నాడు ప్రాంతంలో కీలక రాజకీయ నాయకుడు తెలుగుదేశం పార్టీ నేత మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణ వార్త అందరికి ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. దీంతో పల్నాడు ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కోడెల మరణవార్త విని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కోడెల మరణంతో నరసరావుపేట లో హై అలర్ట్ ప్రకటించారు. కొన్ని దశాబ్దాలుగా పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న కోడెల శివప్రసాద్ రాజకీయంగా సామాజికంగా ఆ ప్రాంతాలలో మంచి పేరు సంపాదించాడు.


అయితే రాజకీయ ప్రయాణం లో ఆయన చేసిన కొన్ని తప్పులు చివరి క్షణాల్లో ఆయనపై ప్రజలకు తప్పుడు అభిప్రాయాలు కలుగజేసయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక అసెంబ్లీ కి సంబంధించిన ఫర్నిచర్ మరియు నియోజకవర్గంలో సామాన్య ప్రజల దగ్గర కుటుంబం పేరట టాక్స్ కలగజేయడం వంటివి కోడెల శివప్రసాద్ రాజకీయ జీవితంలో మారని మచ్చలుగా మిగిలిపోయాయి. దీంతో ప్రస్తుతం కోడెల శివప్రసాద్ పై అనేక కేసులు నియోజకవర్గ పోలీస్ స్టేషన్ పరిధిలో నియోజకవర్గ ప్రజలే పెట్టడం ఆంధ్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.


తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు పిలుపుమేరకు రాజకీయాల్లో అడుగుపెట్టిన కోడెల శివప్రసాద్  రాజకీయ పరంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని డేరింగ్ అండ్ డాషింగ్ పొలిటికల్ లీడర్ గా పేరొందాడు. అయితే కొన్ని రాజకీయ వేధింపుల వల్ల చివరి క్షణాల్లో హైదరాబాద్ నగరం లో సొంత ఇంటిలో ఉరి వేసుకుని కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఏది ఏమైనా చేసిన తప్పులు చివరి క్షణాన కోడెల శివప్రసాద్ ని వెంటాడి మరీ పొట్టన పెట్టుకున్నాయి అని నియోజకవర్గ ప్రజల ఏడుపే గట్టిగా తగిలింది అని చాలామంది కోడెల శివప్రసాద్ సొంత నియోజకవర్గంలో ఉన్న కొంతమంది సీనియర్ రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: