అభిమానులు పల్నాడు పులిగా పిలుచుకునే టీడీపీ సీనియర్ నేత , ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మ హత్య తో  టీడీపీ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది.ఒకవైపు కేసులు చుట్టుముట్టడం ...ఓ వైపు కుటుంబ కలహాల కారణంగానే కోడెల శివప్రసాద్ రావు ఆత్మ హత్య కి పాల్పడ్డాడని భావిస్తున్నారు అంత .కోడెల ఆత్మ హత్య యత్నాన్ని గమనించిన కుటుంబీకులు ... ఆయనని బసవతారకం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కోడెల కన్నుమూశారు .


అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ స్పీకర్ బాధ్యతలు చేపట్టిన కోడెల శివ ప్రసాద్ రావు ...వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు .అయితే అందరి నేతల విషయంలో స్ట్రిక్ట్ గా ఉండే టీడీపీ అధినేత చంద్రబాబు ...కోడెల ఎన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నప్పటికీ లైట్ గానే తీసుకున్నారు . కోడెల పై ఎన్ని ఆరోపణలు వచ్చిన క్నాద్రబాబు పెద్దగా స్పందించలేదు .కోడెల పై ఎన్ని అసత్య ఆరోపణలు వచ్చినప్పటికీ చంద్రబాబు మాత్రం స్పందించకపోవటం తో కోడెల కుటంబం ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని విమర్శలు కూడా వచ్చాయి .


కొండలపై రోజు రోజుకి అవినీతి ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో చివరకి చంద్ర బాబు స్పందించాడు .   తప్పు జరిగితే చట్టపరమైన యాక్షన్ తీసుకుంటే, తమ పార్టీ అడ్డుచెప్పదని ... కానీ ప్రభుత్వం రాజకీయ కక్షలకు పాల్పడితే మాత్రం అడ్డుకుంటామని తెలిపారు చంద్రబాబు .అయితే కోడెల ఆత్మ హత్య కి వైసీపీ కక్ష సాధింపు చర్యలే కారణమని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు .కోడెల మరణంతో ఆయన అభిమానులు నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు. కోడెల శివప్రసాద్ గారి మరణం జీర్ణించుకోలేకపోతున్నాం. వైద్య వృత్తి నుంచి తెదేపాలో చేరి  అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగారు కోడలా ఆయన మృతి పార్టీకి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం అంటూ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా కోడెల మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: