ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు ఈరోజు ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మృతి చెందారు. కోడెల మృతి చెందిన వెంటనే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు శవ రాజకీయాలు మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీకి చెందిన యరపతినేని శ్రీనివాసరావు కోడెల మృతి రాజకీయ హత్యే అని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీ కోడెలను వేధించటం వలనే కోడెల చనిపోయారని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. 
 
తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి కోడెల చనిపోయేంతవరకూ వైసీపీ ప్రభుత్వం వెంటాడి, వేధించిందని ఆరోపణలు చేశారు.కోడెల మెడపై గాట్లు ఉన్నాయని అన్నారు. కోడెల శివ ప్రసాద రావు ఉరేసుకొని చనిపోయారని ప్రచారం అబధ్ధమని వ్యాఖ్యలు చేశారు. శవ పరీక్ష కొరకు ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తున్నామని అన్నారు. తెలుగు దేశం పార్టీ నేతలు కోడెల శవం దగ్గర కూడా శవ రాజకీయాలు చేస్తున్నారు. 
 
కోడెల మృతి చెందిన తరుణంలో అధికార పార్టీ వేధింపులు కోడెల మృతికి కారణమంటూ యరపతినేని రాజకీయాలు చేస్తున్నారు. కోడెల చనిపోవటానికి కారణాలు పూర్తిగా తెలియకముందే ఈ హత్యను రాజకీయ హత్య అని వ్యాఖ్యలు చేస్తున్నారు. కోడెల శవం దగ్గర వైసీపీ పార్టీపై విమర్శలు చేస్తూ యరపతినేని కోడెల శవాన్ని కూడా రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు. 
 
మరో టీడీపీ నేత సోమిరెడ్డి కోడెలను వైసీపీ ప్రభుత్వం వెంటాడి, వేధించిందని ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 100 రోజులు మాత్రమే అయింది. కోడెల శవం దగ్గర కూడా టీడీపీకి చెందిన నాయకులు ఇలా అధికార పక్షాన్నే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న మాటలు ఇతర నాయకుల్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. కోడెలపై ఆరోపణలు వచ్చినప్పుడు అండగా నిలబడని టీడీపీ నాయకులు ఈ రోజు మాత్రం అధికారంలో ఉన్న పార్టీపై విమర్శలు చేయటానికి ముందుకు రావటం గమనార్హం. 



మరింత సమాచారం తెలుసుకోండి: