ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు పల్నాడు ప్రాంతానికి చెందిన కోడెల శివప్రసాద్ మరణ వార్త ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కొద్దిపాటి కొనఊపిరితో తెలుగుదేశం పార్టీ ఏపీలో బ్రతికి ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మరోపక్క 2019 ఎన్నికలకు ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పుతో చాలా మంది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లిపోవడం జరిగింది.


దీంతో సొంత పార్టీలో ముందునుండి కష్టపడి పనిచేసిన సీనియర్ నేతలు టిడిపి నుండి ఇతర పార్టీలోకి వెళ్లిన నేతలపై దారుణమైన కామెంట్లు చేయడం జరిగింది. ఇటువంటి స్థితిలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఉంటే పల్నాడు ప్రాంతంలో కీలకంగా టిడిపికి అండగా ఉండే కోడెల శివప్రసాద్ మరణంతో పల్నాడులో తెలుగుదేశం పార్టీ దుకాణం సర్దుకు పోయినట్లే అని చాలామంది రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.


తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి చాలా విధేయుడిగా నమ్మకస్తుడిగా ఉన్న కోడెల కుటుంబం పలనాడు రాజకీయాల్లో ఆరితేరిన రాజకీయ నేతలుగా తిరుగు లేని వారిగా మొన్నటి వరకు రాణించడం జరిగింది. అయితే చివరి క్షణాల్లో కొన్ని రాజకీయ వేధింపులు వల్ల కోడెల శివప్రసాద్ మరణించడంతో చాలామంది పల్నాడు ప్రాంతంలో ఉన్న సీనియర్ రాజకీయ నేతలు కోడెల మరణంతోనే తెలుగుదేశం పార్టీ చాప్టర్ పలనాడు క్లోజ్ అయినట్టు అభిప్రాయపడుతున్నారు. జరిగిన ఎన్నికలలో ఏపీ ప్రజలు ఇచ్చిన ఫలితం ఒకటైతే పల్నాడు ప్రాంతంలో కోడెల శివప్రసాద్ మరణం తెలుగుదేశం పార్టీకి మరో తీరని దెబ్బ అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: