టిడిపి సీనియర్ నేత నవ్యాంధ్రప్రదేశ్ మొదటి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ రావు  ఆత్మహత్య చేసుకోవటం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. అయితే కోడెల మరణం పై సర్వత్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రోజు రోజుకు కోడెల చుట్టూ కేసుల ఒత్తిడి పెరగుతుండటం కుటుంబ కలహాలు ఏర్పడటం తోనే కోడెల ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని కొందరు బావిస్తుంటే... ఇంకా ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయా అని కొందరు అనుమాన పడుతున్నారు. ఇది ఏమైనా కోడెల మృతి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారమే రేపుతోంది. అయితే కోడెల కూతురు  ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడని చెబుతుంటే... కోడెల  వ్యక్తి గత సిబ్బంది మాత్రం గుండెపోటుతో మృతి చెందారని చెబుతుండటం గమనార్హం... దీంతో కోడెల మృతి పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

 

అయితే కోడెల శివప్రసాద్ రావు కేసుల ఒత్తిడి ఎక్కువవడం తో రెండు  వారల కిందటే  ఆత్మ  హత్య చేసుకునేందుకు ప్రయతించాడని సమాచారం.కుటుంబ కలహాలు, కేసుల వొత్తిడి తట్టుకోలేక మనస్థాపానికి గురైన కోడెల... నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడట... కాగా కుటుంబ సభ్యులు చూసి అప్రమత్తం అవ్వటం తో ప్రమాదం తప్పిందని సమాచారం.  

 

పల్నాడు పులిగా ఎంతో గౌరవంగా బ్రతికిన కోడెల... కేసుల నేపథ్యంలో పరువు పోయి తలవంపులు రావటం తోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని సన్నిహితులు భావిస్తున్నారు. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకుని  చనిపోయారని ఆరోపిస్తున్నారు. కోడెల మృతి ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. కాగా కోడెల మృతి పట్ల పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: