ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు. ఆయన మృతి చెందారన్న విషయం తెలుసుకున్న వీరాభిమానులు, అనుచరులు, నియోజకవర్గ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 40 ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉన్న కోడెల శివ ప్రసాద్  మొదటి నుండి తెలుగు దేశం పార్టీలో ఉన్నారు. 


దాదాపు 40 సంవ‌త్స‌రాల రాజ‌కీయ అనుభ‌వం, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. హోం మంత్రితో పాటు ప‌లు శాఖ‌లు నిర్వ‌హించిన అనుభ‌వం, న‌వ్యాంధ్ర‌కు తొలి అసెంబ్లీ స్పీక‌ర్‌ అనుభవం ఆయనకు ఉంది. ఎవరైనా సరే ఎదిరించి పోరాడగలిగే శక్తి ఆయనకు ఉంది. ఆలాంటి కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివారా అని ప్రశ్నిస్తున్నారు తెలుగు దేశం పార్టీ నేతలు. 


అయితే అతని మృతిపట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోడెల ఒంటిమీద గాయాలు ఉన్నాయని, కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకునే అంత పిరికి వాడు కాదని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే కోడెల భౌతికాయాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు అయన తెలిపారు. 


అయితే కోడెల శివ ప్రసాద్ మృతి ఆత్మహత్యనా ? లేక హత్యన అనే నిజానిజాలు తెలియాలంటే ఇప్పుడు కోడెల స్వా ప్రసాద్ పోస్టుమార్టం రిపోర్టే కీలకమైనది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సిపి అంజని కుమార్ మాట్లాడుతూ ''కోడెల శివప్రసాద్ రావు అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేశారని, మూడు టీమ్ లతో దర్యాప్తు చేస్తున్నారని'' ఆమె తెలిపారు. 


కాగా బంజారాహిల్స్ ఏసీపీ అద్వర్యంలో విచారణ కొనసాగుతుందని, పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాతే శివప్రసాదరావు మృతిపై క్లారిటీ వస్తుందని హైదరాబాద్ సిపి అంజని కుమార్ తెలిపారు. నిజానిజాలు తెలియాలంటే పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చే వరుకు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: