ప్రభుత్వ వేధింపులను తట్టుకోలేకే అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడినట్లు చంద్రబాబు నాయుడు తేల్చేశారు. అంటే చంద్రబాబు నుండి ఇంతకన్నా ఎవరూ ఆశించలేరు లేండి. ఎప్పుడైతే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని తెలియగానే ఓ పద్దతి ప్రకారం వైసిపి ప్రభుత్వంపై బురద చల్లటాన్ని టిడిపి నేతలు మొదలుపెట్టేశారు. దానికి క్లైమ్యాక్స్ లాగ చంద్రబాబు మీడియా ముందు చేసిన ఆరోపణలు.

 

మానసిక వేధింపులు భరించలేక , శారీరక బాధలు తట్టుకోలేకే కోడెల ఆత్మహత్యకు పాల్పడినట్లు చంద్రబాబు చెప్పేశారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కోడెల కుటుంబంపై వేధింపులు, తప్పుడు కేసులు ఎక్కువైపోయాయట. ఆ అవమానాన్ని భరించేలేకే చివరకు కోడెల తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకున్నట్లు చంద్రబాబు చెప్పారు.

 

వైసిపి ప్రభుత్వం వేధింపులను తనతో కూడా కోడెల రెండు మూడుసార్లు చెప్పుకుని బాధపడ్డారట. వెళిపోయిన కోడెల గురించి చంద్రబాబు ఇపుడేం మాట్లాడినా చెల్లుబాటైపోతుంది. పైగా కోడెల మరణానికి కారణాలను జనాలందరూ చర్చించాలట. ప్రజాస్వామ్యంలో వేధింపులు మంచివి కావన్నారు. అవమానికి గురిచేసి ఆత్మహత్య చేసుకునేంతగా వైసిపి ప్రభుత్వం ప్రేరేపించిన విషయాన్ని అందరూ ఆలోచించాలని చంద్రబాబు పిలుపిచ్చారు.

 

వైసిపి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి టిడిపి కార్యకర్తలపై దాడులు, నేతలపై తప్పుడు కేసులు పెరిగిపోయిన విషయమై తాము ఆందోళన కూడా చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేయటమే విచిత్రంగా ఉంది. చంద్రబాబు చెప్పేదే నిజమైతే అసెంబ్లీ ఫర్నీచర్ ను దొంగతనం చేయమని కోడెలకు ఎవరు చెప్పారో  చంద్రబాబు చెబితే బాగుంటుంది. అసెంబ్లీ ఫర్నీచర్ ను తానే తన ఇంట్లోను, క్యాంపాఫీసులోను పెట్టుకున్న విషయాన్ని కోడెలే అంగీకరించారు కదా ? అసెంబ్లీ ఫర్నీచర్ కొడుకు షోరూములో ఎందుకు ఉందో చంద్రబాబు చెప్పగలరా ? దాన్ని సమర్ధించగలరా ?

 

తండ్రి అధికారాన్ని కొడుకు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మి చేసిన అరాచకాల మాటేమిటి ? ఎంతమందిని వేధించారు ?  కోడెల కుటుంబం వల్ల ఎంతమంది ఐదేళ్ళు ఇబ్బంది పడిన మాట వాస్తవం కాదా ? ఇవన్నీ కూడా వైసిపి ప్రభుత్వమే చేయించిందా ? వీటికి చంద్రబాబు సమాధానం చెబితే కోడెలను ఎవరు వేధింపులకు గురిచేసింది అర్ధమైపోతుంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: