సాధారణంగా వాహనదారులు పాత వాహనాల్ని విక్రయించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోరు. ఆ తరువాత విక్రయించిన వాహనం వలన లేనిపోని సమస్యలు వస్తున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొంతమంది వాహనాన్ని అమ్మిన తరువాత చిన్నపాటి బాండ్ పేపర్ పై ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు. కానీ వాహన యజమానులు వాహనాల్ని విక్రయించే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది 
 
పాత వాహనాన్ని కొనుగోలు చేసిన వ్యక్తులు తన పేరుపై రిజిస్ట్రేషన్ మార్చుకోకుండా వాహనం నడిపిస్తే పాత యజమానికి ఈ చలాన్ భారం పడుతోంది. ఈ విషయంలో అధికారులకు చెప్పినా ఫలితం లేకుండా పోతుందని తెలుస్తుంది. వాహనాల అమ్మకాల విషయంలో చాలా మంది ప్రజలు నిబంధనలు పాటించటం లేదు. ప్రతి 100 వాహనాల్లో 35 వాహనాలు పాత యజమానుల పేరుతోనే నడుస్తున్నాయని సమాచారం. 
 
పాత వాహనాల్ని విక్రయించే సమయంలో యాజమాన్య హక్కులను వెంటనే మార్చితే మంచిది. యాజమాన్య హక్కులను మార్చుకోకపోతే మాత్రం వాహనాన్ని అమ్మిన వారే జరిమానాల్ని చెల్లించాల్సి వస్తుంది. పాత వాహనాలు అమ్మిన వారు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తే పన్నుల రూపంలో ద్విచక్ర వాహనాలకు 9 శాతం కారుకు 12 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 
 
పాత వాహనం యజమాని మరో వాహనం కొనుగోలు చేస్తే కారుకైనా, ద్విచక్ర వాహనానికైనా 14 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాలపై అవగాహన పెంచుకుంటే 
అనవసరంగా అదనపు పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. వాహనాల్ని కొన్నవారు అమ్మిన వారి నుండి వాహనాన్ని విక్రయించినట్లు సంతకాలు, ఆధార్ కార్డ్ జిరాక్స్, బీమా, పొల్యూషన్, ఇతర ధృవీకరణ పత్రాలు ఉంటే వాహనాల్ని సులభంగా బదిలీ చేసుకోవచ్చు. వాహనాలు విక్రయించిన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం విక్రయించిన వాహనాల నుండి చాలా సమస్యలే వచ్చే అవకాశం ఉంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: