ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంతో టీడీపీ లో విషాద ఛాయలు అలుముకున్నాయి . అయితే కోడెల ఆత్మహత్య పై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . కేసుల వేధింపులు  తాళలేక ...కుటుంబ కలహాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురయ్యారని అందుకే ఆత్మ హత్య చేసుకున్నారని పలువురు భావిస్తున్నారు . అయితే టీడీపీ శ్రేణులు మాత్రం ముమ్మాటికీ వైసీపీ కక్ష సాధింపు చర్యలు చేపట్టి వేధించటం వల్లే కోడెల ఆత్మ హత్య చేసుకున్నారని ఆరోపిస్తున్నారు .


అయితే ఆత్మహత్య యత్నం చేయగా గమనించిన కుటుంబసభ్యులు కోడెల శివప్రసాద్ రావు ని హుటాహుటిన బసవతారకం ఆసుపత్రికి తరలించారు .అయితే అప్పటికే ఆలస్యం అవ్వటం తో డాక్టర్లు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది . బసవతారకం ఆసుపత్రి కి  ఛైర్మన్‌గా  ఫౌండర్ గా ఉన్న కోడెల శివప్రసాద్ రావు అక్కడే  మరణించటం బాధాకరం. అయితే కోడెల మృతి పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో బసవతారం ఆసుపత్రి కోడెల మరణం పై వివరణ ఇచ్చింది .


ఉదయం 11.35కి అపస్మారక స్థితిలో కోడెల శివప్రసాదరావును ఆస్పత్రికి తీసుకొచ్చారాణి ... ఆయనని  కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించామన్నారు డాక్టర్లు   . కానీ పల్స్, బీపీ రికార్డవలేదు. ఊపిరితిత్తులు, గుండె పనిచేయలేదు. గంటసేపు చికిత్స అందించినా స్పందించకపోవడంతో కోడెల చనిపోయినట్లు మధ్యాహ్నం 12.39కి ధృవీకరించామని తెలిపారు.పోస్టుమార్టం రిపోర్టులో కోడెల మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందన్నారు బసవతారకం డాక్టర్లు.


బసవతారకం ఆసుపత్రిలో చికిత్స అందించటం పై  అనుమానం వ్యక్తం చేశారు    ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. .ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని సంబంధిత ఆస్పత్రికి తీసుకెళ్లకుండా.. క్యాన్సర్ ఆస్పత్రి అయినా బసవతారకం ఆసుపత్రికి  ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు బొత్స . కోడెల మృతిపై తెలంగాణ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలని బొత్స డిమాండ్   చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: