ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు. అయన మృతి పట్ల ఆయన అభిమానులు, రాజకీయ నాయకులూ, నియోజికవర్గ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే కోడెల శివ ప్రసాద్ మృతి పెద్ద మిస్టరీగా మారింది. ఒకరు ఆత్మహత్య అంటే మరొకరు హత్య అని ఆరోపిస్తున్నారు.                 


దీంతో టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా, ఆన్లైన్ మీడియా వారు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. కాగా కోడెల శివప్రసాద్ భౌతికాయం ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అవుతుంది. అయితే కోడెల శివ ప్రసాద్ జగన్ పాలన వల్లే ఆత్మహత్య చేసుకుందని మొదట చాలామంది ఆరోపించారు. రాజకీయ వత్తిడి వల్లే కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని చాలామంది నేతలు ఆరోపించారు.                 


అయితే ఈ ఆరోపణలను నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అనవసరమైన ఆరోపణలు చెయ్యకండి అని నెటిజన్లు మండిపడ్డారు. ఈ ఆరోపణలపై కొంతమంది నెటిజన్లు స్పందిస్తూ 'వంద రోజుల వేధింపులకే ఆత్మహత్య ఐతే ? జగనెన్ని సార్లు చేసికునుండాలి ? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి మరణాంతరం ఒక్కడే ఎన్నో అవమానాలు భరించాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.               


మరోసైడ్ నెటిజన్లు నిజంగా చేసిన పనులను బయట పెడుతూనే ఆత్మహ్యత అయితే అనవసరంగా నిందలు వేసినందుకు జగన్ ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలి అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకు పచ్చ పార్టీ నాయకులూ ఎలా స్పందిస్తారో చూడాలి.         


మరింత సమాచారం తెలుసుకోండి: