ఏపీ మాజీ స్పీకర్ , టీడీపీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందటం తో   ఏపీ రాజకీయాల్లో దుమారం కొనసాగుతుంది . వైసీపీ వేధింపుల కారణంగానే  మనస్తాపం చెందిన కోడెల శివప్రసాద్ రావు ఆత్మ హత్య చేసుకున్నాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు . వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు .మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరావు వైసీపీ ప్రభుత్వం తీరుపై విరుచుకు పడ్డారు . అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీస్ లతో రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టారు అని విమర్శించారు .


ఒకప్పుడు పరిటాల రవిని బౌతికంగా ...ఇప్పుడు కోడెల శివప్రసాద్ రావు ని మానసికంగా క్షోభకు గురిచేసి చేసి చంపారని సంచలన  వ్యాఖ్యలు చేసాడు మాజీ మంత్రి ఉమామహేశ్వరావు . పల్నాడులో కాంగ్రెస్ ఎత్తుగడలు తట్టుకొని నిలబడ్డ వ్యక్తి కోడెల అని .. ప్రభుత్వ వేధింపుల గురించి కోడెల మాతో చాలా సందర్భాల్లో చెప్పి  బాధపడ్డారని దేవినేని అన్నారు .


కాగా ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం కోడెల  భౌతికకాయాన్ని  ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌‌కు తరలించారు.   ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌‌ లో కోడెల పార్థివదేహానికి మాజీ మంత్రులు దేవినేని ఉమ తో  పాటు ,హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ, కేఈ కృష్ణమూర్తి  శ్రద్ధాంజలి ఘటించారు. కోడెల పార్థివదేహాన్ని రేపు  గుంటూరుకు తీసుకెళ్లి . అభిమానులు, ప్రజల సందర్శనార్థం పార్టీలో కార్యాలయంలో ఉంచి అనంతరం అంత్యక్రియలు జరపనున్నారు .


కాగా కోడెల మృతి పై వైసీపీ నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు . ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని సంబంధిత ఆసుపత్రికి తీసుకెళ్లకుండా కాన్సర్ ఆసుపత్రి అయినా బసవతారకం ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లారు అంటూ మంత్రి
బొత్స సత్యనారాయణ అనుమానం వ్యక్తం చేశారు 


మరింత సమాచారం తెలుసుకోండి: