దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ చట్టాలు ఎలా వున్నాయంటే కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లుగా,పాకడం రాని వారికి పాఠాలు చెప్పినట్లుగా ఉంటున్నాయట. అసలు ఈ కొత్త చట్టం తెచ్చేటప్పుడు ఫస్ట్ చేయవలసిన పనేంటంటే అన్ని రాష్ట్రాల పోలీసులకు దేని దేనికి చలాన్ వేయాలి,ఎంతెంత వేయాలి అని ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి చలానాల చట్టాన్ని అమలుచేస్తే బాగుంటుందని ఇప్పటివరకు బాధింపబడ్డ బాధితులు అనుకుంటున్నారు.ఎందుకంటే ఇకముందు ఎవరికి వారి లాంటి కష్టం రావద్దట.ఇక ఈ చట్టం వాహనదారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.ఎందుకంటే పోలీసులు విధిస్తున్న కొన్ని జరిమానాలు వాహనదారులను గందరగోళానికి గురిచేస్తున్నాయికాబట్టి.ఇక ఇటీవల ఓ వ్యక్తి కారులో హెల్మెట్ పెట్టుకోలేదనే కారణంతో పోలీసులు జరిమానా విధించగా.తాజాగా ఓ ఆటో డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోలేదని చలానా విధించారు.ఇవన్ని మరవకముందే ఇప్పుడు ఎడ్లబండికి జరిమాన వేసారు.ఆశ్చర్యపోకండి మీరు విన్నది నిజమే..



అందరికంటే మేమేమి తక్కువ కాదన్నట్లు ఉత్తరఖండ్‌లోని డెహ్రాడూన్‌ పోలీసులు ఒక అడుగు ముందుకేసి కొత్తగా అమల్లోకి వచ్చిన మోటర్ వెహికిల్స్ చట్టం కింద ఎద్దుల బండికి జరిమానా విధించారు.ఎడ్ల బండి మోటారు వాహనం కాకున్నా.. దానికి కనీసం నెంబరు ప్లేటు లేకున్నా పోలీసులు చలానా వేసి ఆశ్చర్యపరిచారు. అదెలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే.. సాహస్‌పూర్‌లోని చబ్రా గ్రామంలో చోటుచేసుకున్న మాంచి కిక్కిచ్చే ఈ సంఘటన గురించి తెలుసుకోవల్సిందే. 



రియాజ్ హసన్ అనే రైతు తన పొలం వద్ద ఎడ్ల బండిని నిలిపి పొలంపనికి వెళ్లాడట.ఆసమయంలో అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఆ ఎడ్ల బండి నో పార్కింగ్ ప్లేస్‌లో ఉందంటూ స్థానికులను అడిగి అతడి వివరాలను తెలుసుకుని చలానా రాశారట.అనంతరం అతడి ఇంటికి వెళ్లి రూ.1000 చలానా రసీదు అందించారట.చలానా చూసిన రియాజ్ షాకయ్యాడు.ఎడ్ల బండి మోటారు వాహనమే కాదని,ఆ చట్టం కింద చలానా ఎలా విధిస్తారని పోలీసులను ప్రశ్నించాడు.పైగా, తాను ఎడ్ల బండిని నిలిపిన ప్రాంతం రోడ్డుపైన లేదంటూ అది తన పొలంలోనే ఉందంటు వారితో వాదించాడట.ఇక వెంటనే ఈ సమాచారం దావనంలా వ్యాపించడంతో అంతా పోలీసులను తప్పుబట్టారు.



దీంతో పోలీసులు ఆ చలానాను రద్దు చేస్తున్నట్లు తెలిపారట.ఇక ఈ విషయాన్నిస్టేషన్ ఇన్‌ఛార్జ్ వరకు వెళ్లడంతో ఇన్‌ఛార్జ్ గా ఉన్న పీడీ భట్ మాట్లాడుతూ,ఆ ప్రాంతంలో కొందరు ఎడ్ల బండ్లపై ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఆ ప్రదేశంలో రియాజ్ ఎడ్ల బండి కనిపించింది.దీంతో అతడిపై ఐపీసీ చట్టం కింద జరిమానా విధించాలని మా సిబ్బంది భావించారు.అయితే,మోటార్ వెహికిల్ చట్టం బిల్లు పుస్తకం,ఐపీసీ చట్టం బిల్లు పుస్తకం ఒకేలా ఉండటంతో పొరపాటుగా ఆ జరిమానా విధించారు,అని సంజాయిషి ఇచ్చుకున్నారట.చూసారుగా చట్టం చేతిలోవుందని ప్రతిదానికి చలానా చిట్టాలు రాస్తుంటే ఇక ప్రజలు ఇంట్లోనుండి బయటకు వెళ్లడం మానుకోవాల అని ఈ విషయం తెలిసిన కొందరు ప్రశ్నిస్తూ వున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: