బ్లడ్ ప్రెజర్.. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవలసిన అవసరం ఉంది.  బ్లడ్ ప్రెజర్ అదుపులో లేకుంటే.. వచ్చే ఇబ్బందులు అన్ని ఇన్నీకావు.  బ్లడ్ ప్రెజర్ పెరిగితే.. గుండెకు ఇబ్బందులు ఎదురౌతాయి.  మరి బిపి కంట్రోల్ లో ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. బిపి నుంచి ఎలా బయటపడాలి.. ముఖ్యంగా మనం ప్రతి చిన్న విషయానికి కన్నెర్ర చేయడం, ఉన్నదానికి లేనిదానికి ఉవ్వెత్తున కెరటంలా ఎగసిపడటం చేస్తుంటారు.  దీని అర్ధం ఏంటి.. శరీరంలో ఓ బెలూన్ పెట్టుకొని తిరుగుతున్నట్టే.  అది బ్లాస్ట్ అంతే గోవిందా.  మనం ఎంత రిలాక్స్ గా ఉంటె అంత ఆరోగ్యం.  ఎంత ప్రశాంతంగా పని చేసుకుంటూ పోతుంటే అంట మంచి ఆరోగ్యం.  బీపీని కాంట్రిల్ చేయసుకోవడానికి చాలా ఆహారపదార్ధాలు అందుబాటులో ఉన్నాయి అవేంటో చూద్దాం.  


 ద్రాక్ష : 
సిట్రస్ జాతికి చెందిన ద్రాక్ష పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.  రుచికి పుల్లగా ఉండే ద్రాక్ష పండ్లను ఆహారంగా తీసుకోవడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.  ద్రాక్ష పండ్లలో పొటాషియం, ఫాస్పరస్ లు అధికంగా ఉంటాయి.  పొటాషియం, ఫాస్పరస్ లు బీపీని కంట్రోల్ చేస్తాయి.  


అరటిపండు : 
అరటిపండ్లలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది.  450 గ్రాముల అరటిపండులో పొటాషియంతో పాటు విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నీషియం మూలకాలు ఉంటాయి.  మెగ్నీషియం మూలకాలు బీపీని కంట్రోల్ చేయడంలో సమర్ధవంతంగా పనిచేస్తాయి.  


ఉల్లిపాయాలు : 
ఉల్లిపాయ లేని కూర రుచిగా ఉండదు.  ప్రతి ఇంట్లో వంట గదిలో తప్పకుండా ఉల్లిపాయ ఉంటుంది. కూరల్లో తినడం కంటే ఉల్లిపాయను పచ్చిగా తినడం వలన ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి.  పచ్చి ఉల్లిపాయలను తీసుకుంటే.. బ్లడ్ ప్రెజర్ నుంచి బయటపడొచ్చు. 


గార్లిక్ : 
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు.  ఇది ముమ్మాటికీ నిజం.  ఉల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు సిరల్లో అడ్డుగా ఉన్న కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది.  ఫలితంగా బిపి నుంచి బయటపడొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: