ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎంగా తన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అన్ని సంచలన నిర్ణయాలే అమలు చేస్తూ వస్తున్నారు యోగి.  తన పాలన గాడి తప్పకుండా చక్కబెట్టి పనిలో ఉంటారు ఆయన. ప్రజల విషయంలో తన పాలనలో అధికారులు  ఏ పొరపాటు చేసినా సహించని నాయకుడు యోగి ఆదిత్యానాథ్. ఆయనంటేనే నాయకుల్లో, అధికారుల్లో దడే. ఇకపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, డిప్యూటీ మంత్రుల ఆదాయపన్నును ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించకూడదని కీలక నిర్ణయించింది. అయితే ఉత్తర ప్రదేశ్ లో 1981 సంవత్సరం నుంచి ఈ విధానం అమలవుతూ వస్తోంది. అయితే  అప్పటి నుంచి మంత్రుల జీతాలపై ఆదాయ పన్నును ప్రభుత్వమే తమ ఖజానా నుంచి చెల్లిస్తూ వస్తోంది. అయితే ఈ విషయంపై పెద్ద దుమారం రేగింది. మిగిలిన ప్రజలు అందరూ తమ జీతాల మీద ఆదాయ పన్నును వారే చెల్లిస్తుంటే, వారికి మాత్రం ప్రత్యేక ప్రయోజనాలు ఎందుకనే ప్రశ్న తెరపైకి వచ్చింది. 1981లో ఈ నిబంధన పెట్టినప్పుడు ముఖ్యమంత్రి వేతనం నెలకు రూ.1000, మంత్రుల వేతనాలు రూ. 650 ఉండేవి. అయితే, ఇప్పుడు సీఎం నెలకు రూ.40వేల జీతం తీసుకుంటున్నారు. మంత్రులు రూ.35 వేలు అందుకుంటున్నారు. గడిచిన 38 సంవత్సరాల్లో మంత్రుల వేతనాలు 40 సార్లు పెరుగుతూ వచ్చాయి. అలాంటప్పుడు వారి ఆదాయ పన్ను ఇంకా ప్రభుత్వమే చెల్లించాలనుకోవడం సరికాదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అభిప్రాయపడింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రుల ఆదాయపన్ను కింద ప్రభుత్వ ఖజానా నుంచి రూ.81 లక్షలను చెల్లించడంతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. 1981 నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మంది ముఖ్యమంత్రులు మారారు. కానీ, చట్టంలో నుంచి ఆ నిబంధనను మాత్రం తొలగించలేకపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: