భారతదేశంలోని వాహనదారులకు అతి త్వరలోనే మరో షాక్ తగలబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొత్త మోటారు వాహనాల చట్టం అమలు చేసిన తరువాత భారీ జరిమానాలు వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి.కొన్ని సందర్భాల్లో వాహనాల వ్యయం కంటే జరిమానానే ఎక్కువగా ఉందని వాహనదారులు చెబుతున్నారు. జరిమానాలు చెల్లించలేక వాహనాల్ని వదిలివెళ్లటం లేదా వాహనాల్ని కాల్చేయటం లాంటి ఘటనలు కూడా జరిగాయి. 
 
ఇలాంటి సమయంలో వాహనదారులకు త్వరలోనే పెట్రోల్ షాక్ తగలబోతుందని తెలుస్తోంది. అతి త్వరలోనే పెట్రోల్ ధరలు భారీగా పెరగబోతున్నాయని సమాచారం అందుతుంది. లీటర్ పెట్రోల్ ధర 6 నుండి 7 రుపాయల వరకు పెరిగే అవకాశం ఉందని సమాచారం. డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగటానికి అరామ్ కో చమురు శుధ్ధి కేంద్రంపై జరిగిన డ్రోన్ దాడే కారణమని తెలుస్తోంది. 
 
ఈ కారణం వలనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగబోతున్నాయని సమాచారం అందుతుంది. అరామ్ కో చమురు శుధ్ధి కేంద్రం ప్రపంచంలోనే అతి పెద్దదైన చమురు శుధ్ధి కేంద్రం. కొన్ని రోజుల క్రితం తిరుగుబాటుదారులు ఈ చమురు శుధ్ధి కేంద్రంపై డ్రోన్ దాడులకు పాల్పడ్డారు. డ్రోన్ దాడులు జరగటంతో క్రూడ్ ఆయిల్ బావులు దెబ్బ తిన్నట్లు తెలుస్తోంది. క్రూడ్ ఆయిల్ బావులు దెబ్బ తినటంతో కంపెనీ ఉత్పత్తి సగానికి సగం తగ్గింది. 
 
అరామ్ కో కేంద్రం నుండి అందుతున్న సమాచారం ప్రకారం క్రూడ్ ఆయిల్ బావులను బాగు చేసే వరకు ఉత్పత్తి తక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. అరామ్ కో ఉత్పత్తి తగ్గితే ఆ ప్రభావం చమురు ధరలపై పడే అవకాశం ఉందని సమాచారం. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ క్రూడ్ ఆయిల్ ధరలు ప్రస్తుతం ఉన్న స్థితిలోనే ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: