గత కొంతకాలంగా ఉత్తరాదిని వర్షాలు ముంచెత్తుతున్నాయి.  గంగానది పొంగి పొర్లుతున్నది.  దీంతో జనజీవనం స్తంభించి పోతున్నది.  పంటపొలాలోకి వరదనీరు రావడంతో పంటలు నాశనం అవుతున్నాయి.  ఊర్లలోకి నీరు ప్రవేశించడంతో.. జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  ప్రజా రవాణా వ్యవస్థలు స్తంభించి పోతున్నాయి.  ఇదిలా ఉంటె, కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్ లో కురుస్తున్న వర్షాలకు గంగానది ఉగ్రరూపం దాల్చింది.  


బాలియా జిల్లాలోని బైరియా తెహసిల్ ప్రాంతంలోని కెహర్ పూర్ గ్రామంలోని ఓ ఇంటిని గంగానది తనలో కలిపేసుకుంది. నది ఒడ్డున అందమైన  కట్టుకొని అందులో హాయిగా నివాసం ఉండాలని అందరు అనుకుంటారు.  కానీ, కొంతమందికే అలాంటి అవకాశం వస్తుంది.  అలాంటి అవకాశం ఓ కుటుంబానికి వచ్చింది.  చుట్టూ మంచి ప్రకృతి.. హ్యాపీగా లైఫ్ సాగిపోతున్నది.  


అంతలో గంగానదికి కోపం వచ్చింది.  ఉదృతంగా పొంగింది.  ఉన్నట్టుండి వరద తాకిడి ఎక్కువ కావడంతో.. పొంగి ప్రవహించి నది ఒడ్డున ఉన్న ఆ అందమైన ఇంటిని క్షణాల్లో తనలో కలిపేసుకుంది.  కళ్లుమూసి తెరిసే సరికి అక్కడ ఇల్లు మాయం అయ్యింది.  అయితే, గంగానది పోటెత్తి ప్రవహిస్తుందని గమనించిన అధికారులు.. ఆ ఇంట్లో ఉండే వ్యక్తులను అక్కడి నుంచి ముందుగానే ఖాళీ చేయించారు.  


అలా ఖాళీ చేయించడంతో పాపం ఆ ఇంట్లో వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు.  లేదంటే... వారంతా గంగమ్మకు బలికావాల్సి వచ్చేది.  నదులకు వరద పోటెత్తినపుడు నదీపరీవాహ ప్రాంతాల్లోని ఇళ్లను అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తుంటారు.  ఇది గంగానది పరివాహ ప్రాంతంలో నివసించే వ్యక్తులకు మామూలే.  సడెన్ గా చూసేవారికి మాత్రం దీన్ని తొందరగా జీర్ణం చేసుకోలేరు.  ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు వస్తాయని అక్కడి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది.  అయితే, గతంలో కంటే ఈ ఏడాది అధికంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: