కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చిన తరువాత రోడ్లపై వాహనాలు రావాలంటే భయపడిపోతున్నారు.  ఎక్కడ ఎలాంటి చలానా వేస్తారో అని ఇబ్బందులు పడుతున్నారు.  అన్ని పత్రాలు ఖచ్చితంగా ఉంటేనే రోడ్డుపైకి వాహనాలను తీసుకొస్తున్నారు.  లేదంటే ఇంట్లోనే ఉంచి ప్రజా రవాణాను ఉపయోగించుకుంటున్నారు. పైగా అన్ని సక్రమంగా ఉన్నా ఏదో ఒక వంకతో మరో విధంగా చార్జీలు మోత తప్పడంలేదు.  అందుకే ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు పాపం ప్రజలు నానా రకాలుగా అవస్థలు పడుతున్నారు.  


ఇటీవలే ఓ వ్యక్తి కారులో హెల్మెట్ లేదని జరిమానా వేశారు.  ఆటోలో సీట్ బెల్ట్ పెట్టుకోలేదని జరిమానా విధించారు.  ఇంకా అనేక రకాలుగా జరిమానాలు విధిస్తూనే ఉన్నారు.  రీసెంట్ గా ఓ ఎద్దులబండికి జరిమానా వేశారు. ఎద్దుల బండికి లైసెన్స్ అవసరం లేదు.  ఎద్దుల బండి ఎలాంటి పెట్రోల్ ను వినియోగించదు.  మరెందుకు ఎద్దుల బండికి చలానా విధించినట్టు.  కారణాలు ఏంటి తెలుసుకుందాం.  


ఉత్తరాఖండ్ లోని ఛబ్రాలో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది.    ఛబ్రా గ్రామానికి చెందిన రియాజ్ హుస్సేన్ అనే ఓ వ్యక్తి ఎద్దులబండిపై తన పొలానికి వెళ్ళాడు.  బండికి పక్కన నిలిపి పొలం పనుల్లో మునిగిపోయాడు.  బండిని రోడ్డుపై పెట్టేశారు.  ఈలోగా అటుగా వెళ్తున్న పోలీస్ వాహనం ఆ బండికి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.  విషయం తెలుసుకున్న రియాజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా ఎద్దుల బండికి రూ. 1000 ఫైన్ వేశారు.  వాహన చట్టంలో ఎద్దుల బండికి ఫైన్ లేదని వాదించాడు.  చివరకు ఆ బండి ఓనర్ రియాజ్ ను మందలించి వదిలేశారు.  ఆ ఏరియాలో ఎద్దులబండి ద్వారా అక్రంగా ఇసుక రవాణా జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయని, అందుకే విచారణ కోసం పిలిపించామని అన్నారు.    


ఇసుక రవాణా జరిగితే.. ఇసుకను తీసుకెళ్లే సమయంలో ఎద్దులబండిని ఆపి జరిమానా వేయాలిగాని, ఇలా పొలంలో ఉండగా బండిని తీసుకెళ్లి జరిమానా వేయడం ఏంటని విమర్శలు వస్తున్నాయి.  కొత్తవాహన చట్టం అమలుపై చాలా రాష్ట్రాలు వెనకడుగు వేస్తున్న సంగతి తెలిసిందే.  చలానాలు భారీగా ఉంటె.. ప్రజల్లోకి వెళ్ళాలి అంటే భయంగా ఉందని, రోజువారీ జీవనానికి ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈస్థాయిలో జరిమానాలు విధిస్తే భావ్యం కాదని కొందరు చెప్తున్నారు.  జరిమానాలు కాకుండా ప్రతి ఒక్కరు చట్టాలను, రూల్స్ ను సక్రమంగా పాటించే విధంగా ఏదైనా రూల్ తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.  రూల్స్ అతిక్రమించిన వ్యక్తుల బండ్లను ఓ వారం పాటు సీజ్ చేయడమో, జీబ్రా లైన్స్ క్రాస్ చేసిన వాళ్ళను పట్టుకొని వాళ్లకు ట్రాఫిక్ లో ఒకరు రోజు పనిచేయించడమో చేయాలి.  అప్పుడు తప్పకుండా కొంత మార్పు వస్తుంది.  జరిమానాలు విధిస్తే వ్యతిరేకత వస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: