కోడెల శివప్రసాద్ టీడీపీలో సీనియర్ మోస్ట్ లీడర్. ఒక్క మాటలో చెప్పాలంటే ఇపుడు ఉన్న చంద్రబాబు కంటే కూడా ఆయన సీనియర్. 1983లోనే ఎమ్మెల్యేగా గెలిచి పార్టీలో సత్తా చాటారు. తరువాత వచ్చిన చంద్రబాబు అధికారం కోసం వేసిన ఎత్తులు, వ్యూహాలు అన్నీ పక్కన పెడితే టీడీపీ పునాదుల్లో ఒకరిగా కోడెలను చెప్పుకోవాలి. మరి కోడెల పార్టీకి అంత చేస్తే ఆయన్ని పార్టీ ఎలా ఉపయోగించుకుందన్నది రాజకీయాల్లో చర్చగానే ఉంది.


స్పీకర్ గా కోడెలను అడ్డం పెట్టుకుని 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాగేశారు. ఆ తరువాత సభా సంప్రదాయలను భిన్నంగా వైసీపీ మహిళా ఎమ్మెల్యే  రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేయించారు. సభలో టీడీపీ సభ్యులు అసభ్యపద దూషణతో రెచ్చిపోతూ ప్రతిపక్షాన్ని నూటేస్తామని నిండు సభలోనే హెచ్చరించిన ఉదంతాలు కూడా అనాడు ఎన్నో  ఉన్నాయి. స్పీకర్ గా కోడెల ఉన్న కధ నడిపించిన వారు టీడీపీ పెద్దలే అంటారు. ఓ విధంగా వైసీపీ  ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కోడెల అందరికీ కనిపించినా వెనక ఉన్నది మాత్రం పార్టీ పెద్దలే  అని చెబుతారు. 


ఇంతలా పార్టీ కోసం చెసిన కోడెలను ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు కూడా చివరి నిముషం వరకూ పార్టీ పెద్దలు  వెయింటింగ్ లో ఉంచారని ప్రచారం  కూడా ఉంది. ఇక కోడెల ఓడిపోవడం ఆయన మీద కేసులు వరసగా  రావడం వంటివి జరుగుతూంటే  టీడీపీ అధినాయకత్వం ఆయనకు  గట్టి భరోసా ఇచ్చిందా అన్న ప్రశ్న  సహజంగానే వస్తుంది. ఆత్మకూర్ లో ఉన్న వైసీపీ బాధితులకు చంద్రబాబు తాను భరోసా ఇస్తానని చెప్పారు. చలో ఆత్మకూర్  అన్నారు. మరి అటువంటి భరోసా కోడెలకు బాబు ఇవ్వలేదా. 



టీడీపీ ఇపుడు చేస్తున్న ఆరోపణలు, ప్రభుత్వ వేధింపులు నిజమైతే పార్టీ భరోసా ఆయనకు దక్కలేదనే అనుకోవాలి. పార్టీ నేనున్నాను అంటే అంత పెద్ద లీడర్ ఆత్మహత్య చేసుకుని మరీ  చనిపోతారా. ఇపుడు కోడెల ఎపిసోడ్ లో ఓవరాక్షన్ చేస్తూ రాజకీయ లబ్దిని పొందడానికి టీడీపీ ట్రై చెస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.  మరి అదే సమయంలో టీడీపీ ఫెయిల్యూర్ తనకు తానే చెప్పుకుంటున్నట్లుగా ఉందని కూడా అంటున్నారు. 


పైగా ఆయనకు నేనున్నాను అంటూ అండ పార్టీ నుంచి వస్తే ఇలా చేసేవారా అన్న ప్రశ్నలకు సమాధానం ఉందా అన్న వారూ ఉన్నారు. కోడెలను బతికి ఉన్నపుడు వాడుకుని ఇపుడు కూడా శవ రాజకీయాలు చేద్దామనుకుంటున్నారని వైసీపీ నేతలు అంటున్నారంటే టీడీపీ ఏ రేంజిలో ఓవయాక్షన్ చేస్తోందో కదా. 


మరింత సమాచారం తెలుసుకోండి: