దృతరాష్టుని వల్లమాలిన పుత్రవాత్సల్యమే మహాభారత కురుక్షేత్ర దానికి కారణం అయ్యింది.  దృతరాష్ట్రుడు గనుక దుర్యోధనుని కట్టడి చేసి  ఉంటే కురుక్షేత్రం జరిగి ఉండేది కాదన్నది జగమెరిగిన సత్యమే.  ప్రస్తుత రాజకీయాల్లో అందరూ అభినవ దృతరాష్ట్రులే  ఉన్నారు.  తమ పిల్లల పట్ల  వల్లమాలిన పుత్రవాత్సల్యం తో వారు ఏమి చేసినా, చూసి , చూడనట్లు వ్యవహరించడం... తప్పులు చేస్తోన్న కట్టడి చేయకుండా మౌనం వహించడం విపరీత పరిణాలకు దారి తీస్తోంది .   చివరకు అది ఎంతవర కంటే చివరకు ప్రాణాలను బలి తీసుకునేంతగా అని ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఉదంతాన్ని పరిశీలిస్తే స్పష్టం అవుతోంది .


 కోడెల ఆత్మహత్యకు  వల్లమాలిన పుత్రవాత్సల్యం  కారణం అయి ఉంటుందని  టిడిపి లోని ఒక సీనియర్ నాయకుడు మీడియా ముందే వ్యాఖ్యానించడం గమనార్హం .  1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఎన్టీఆర్ పిలుపుమేరకు రాజకీయాల్లో ప్రవేశించిన డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి,  పలు  మంత్రి పదవులు నిర్వహించారు.  చివరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా పనిచేశారు.  అయితే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివప్రసాదరావు రెండు దఫాలు ఓటమిపాలైన అనంతరం 2014లో నియోజకవర్గాన్ని మార్చుకుని సత్తెనపల్లి నుంచి పోటీ చేసి గెలుపొందారు.  సత్తనపల్లి నుంచి గెలుపొందిన తర్వాత, కోడెల వ్యవహారశైలి లో  మార్పు వచ్చిందని టిడిపి నేతలు అంటున్నారు.


 అప్పటి వరకు అన్ని తానే అన్నట్లు వ్యవహరించిన  కోడెల,  2014లో గెలుపు తర్వాత మాత్రం, అన్నింటికి ఆయన పెద్ద కుమారుడు పై ఆధారపడి నట్లుగా చెబుతుంటారు.  కుమారుడు శివరాం అన్నింటికీ ఒక రేటును నిర్ణయించి పనులు చక్కబెట్టడం తో అప్పటి వరకూ సంపాదించుకున్న కోడెల ప్రతిష్ట కాస్తా మసకబారుతూ  వచ్చిందని సొంత పార్టీ నేతలే చెబు తున్నారు.   అయిదేళ్ళ తండ్రి పదవీకాలంలో కోడెల శివరాం సాగించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావనే ఆరోపణలు విన్పిస్తున్నాయి .


 2019లో అధికార మార్పిడి అనంతరం  వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల  కుటుంబం పై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి.  దాంతో గత మూడు నెలలుగా కోడెల పై,  అయన కుటుంబ సభ్యులపై  కేసులు నమోదు పరంపర కొనసాగుతూనే వచ్చింది.  దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల  అర్థాంతరంగా తనువు చాలించార ని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తొలినాళ్లలో రాజకీయాల్లో ఎందుకు ప్రవేశించారో ...పుత్ర వాత్సల్యం ఆ విషయాన్ని మర్చిపోయిన కోడెల , చివరకు అభినవ దృతరాష్టుడిగా అప్రతిష్ట మూటగట్టుకోవాల్సి వచ్చింది .


మరింత సమాచారం తెలుసుకోండి: