ప్రపంచంలోనే విలువైన వస్తువుల్లో చమురు ఒకటి. గల్ఫ్ లో చమురుబావులు ఉంటె చాలు.. కోట్లాది డాలర్లు చేతిలో ఉన్నట్టే.  అందుకే అక్కడి వ్యక్తుల లైఫ్ స్టైల్ రిచ్ గా ఉంటుంది.  అదే సమయంలో ఆయా ఉత్పత్తులపై ఇతరదేశాలు కన్నేయడం పరిపాటే. ముడి చమురు నుంచి ఎన్నో రకాల ఉత్త్పత్తులను తయారు చేస్తారు.  అందులో ఒకటి పెట్రోల్, డీజిల్, వైట్ పెట్రోల్, ఈథేన్, తారు ఇలా ఎన్నో రకాల ఉత్పత్తులు దీని నుంచి వస్తుంటాయి.  


అయితే, సౌదీ అరేబియాలోని అరాంకో చమురు శుద్ధి కర్మాగారం నుంచి ఎక్కువగా ఇలాంటి ఉత్పత్తులు బయటకు వస్తుంటాయి.  రోజు లక్షలాది బ్యారెళ్ల చమురును అక్కడ శుద్ధి చేస్తారు.  అయితే, గత కొంతకాలంగా సౌదీ, ఇరాన్, సిరియా దేశాల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా చమురు ఉత్పత్తి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. సిరియాకు చెందిన హవుతి తురుగుబాటు దారులు డ్రోన్ ల సహాయంతో అరాంకో చమురు శుద్ధి కర్మాగారంపై దాడులు చేశారు.  ఈ దాడుల కారణంగా అక్కడ చమురు ఉత్పత్తి ఆగిపోయింది 


దీంతో సౌదీ అరేబియా హవుతి తిరుగుబాటుదారులపై గుర్రుగా ఉన్నది.  ఇరాన్ ప్రోద్బలంతోనే అలా చేస్తున్నారని, ఇరాన్ వారికి సహాయ సహకారాలు అందిస్తోందని అంటోంది.  రోజు రోజుకు సౌదీలో పరిస్థితులు క్షిణించిపోతున్నాయి. యుద్ధ వాతావరణం నెలకొన్నది.  ఇవే పరిస్థితులు మరికొన్ని రోజులు కొనసాగితే గల్ఫ్ లో మరో యుద్ధం వచ్చే అవకాశం ఉన్నది.  ఇప్పటి వరకు గల్ఫ్ లో జరిగిన యుద్ధాలకు ప్రయక్షంగా, పరోక్షంగా అమెరికా సహకారం అందిస్తూ వస్తున్నది.  


ఇప్పుడు మరోసారి గల్ఫ్ లో చమురు యుద్ధం కనుక జరిగే అవకాశం ఉంటె.. దానికి అమెరికా ఎలాంటి సహకారం అందిస్తుంది అన్నది తెలియాల్సి ఉన్నది.  చమురు ఎక్కువగా వినియోగించే దేశాల్లో అమెరికా ఒకటి.  ఇటు ఇండియా కూడా చమురును ఎక్కువగా వినియోగిస్తున్నా.. కొంతమేర ఇండియాలో చమురును ఉత్పత్తి చేసుకుంటోంది. ఎడారి ప్రాంతాల్లోనే చమురు ఎక్కువగా దొరుకుతుంది.  అటు రష్యాకూడా ఎక్కువగా చమురును ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటి.  ప్రపంచంలో ప్రతి దేశంలో దీని వియోగం ఉన్నది కాబట్టి గల్ఫ్ లో యుద్ధం వస్తే.. దాని ప్రభావం ప్రపంచదేశాలన్నింటిపై పడుతుంది.  అందులో సందేహం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: