భూమి పుట్టుక దాని పుట్టు పూర్వోత్తరాలు.. తదితర విషయాలను గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆసక్తిగానే ఉంటుంది.  అందుకే దీనికోసం ప్రత్యేకంగా ఆంత్రోపాలజీని ఏర్పాటు చేశారు.  ఈ సబ్జెక్టు లో దీని గురించే ఉంటుంది.  భూవినాశనానికి చాలా కారణాలు ఉన్నాయి.  అందులో ముఖ్య భూమిక పోషించేది మాత్రం పర్యావరణమే.  పర్యావరణంలో జరుగుతున్న మార్పుల కారణంగానే భూవినాశనం జరుగుతున్నది. ఇప్పటి వరకు ఆరుసార్లు భూవినాశనం జరిగింది.  మొదట ఐదుసార్లు మాత్రమే భూవినాశనం జరిగినట్టుగా లెక్కలు ఉన్నాయి.  


అమెరికాలోని న్యూయార్క్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం ఇప్పటి వరకు ఆరుసార్లు భూవినాశనం జరిగినట్టు లెక్కతేల్చింది.  భూమిపై పర్యావరణం సమతుల్యత లోపం కారణంగా, అగ్నిపర్వతాలోని శిలలు బద్దలయ్యి లావా ప్రవహించినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  లక్షల చదరపు కోలోమీటర్ల మేర ఈ లావా వ్యాపించింది.  సుమారు 26 కోట్ల సంవత్సరాల క్రితం చివరి వినాశనం జరిగినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  


అయితే, ఇప్పటి పరిస్థితులు అప్పటి పరిస్థితులకు దగ్గరగా ఉన్నాయని, పర్యావరణం సమతుల్యత దెబ్బతింటోందని, సమతుల్యత లోపిస్తే జరిగే వినాశనం ఒకసారి అంచనా వేయాలని అంటున్నారు.  సమతుల్యత లోపం కారణం జరిగే వినాశనం భారీస్థాయిలో ఉంటుందని చెప్తున్నారు.  26 కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన వినాశనం కారణంగా భూమిపై జంతువులు, వృక్షాలు మొత్తం నాశనం అయ్యాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 


ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు పర్యావరణ వేత్తలు, ప్రజలు, ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని పిలుపునిస్తున్నారు.  పర్యావరణం సమతుల్యంగా ఉంటనే మనిషి మనుగడ సాధ్యం అవుతుంది.  లేదంటే ఇలాంటి విపత్తులు తప్పవని హెచ్చరిస్తున్నారు.  ఇప్పటికే అడవులు కొట్టివేయడం, ప్లాస్టిక్ వాడకం వంటివి ఎక్కువయ్యాయి.  ఈ ప్లాస్టిక్ కారణంగా భూమిలో కర్బన వాయువులు పెరిగిపోతున్నాయి.  ప్లాస్టిక్ వాడకం కారణంగా భూమిలో సారం తగ్గిపోతున్నది.   ఇలా ఎన్నో రకాల విపత్తులకు కారణం అవుతున్నది.   


మరింత సమాచారం తెలుసుకోండి: