ఈ మధ్య కాలంలో ఏ బిల్లు ఎలా వస్తుందో తెలియడం లేదు. ఒకప్పుడు హెల్మెట్ లేకపోతే 100 రూపాయిలు ఫైన్ వేసేవారు. కానీ ఇప్పుడు మధ్య తరగతి ప్రజల జీతంలో దాదాపు మూడు రోజుల జీతాన్ని అంటే 100 రూపాయిలు మింగేస్తున్నారు. చిన్న చిన్న తప్పులకు కూడా భారీ చలాన్లు వేసి చంపేస్తున్నారు. అయితే సరిగ్గా ఇదే తరహాలో కరెంటు బిల్లు 6 లక్షల రూపాయిలు వచ్చి ఓ వినియోగదారుడికి కరెంటు బిల్లుతో కరెంటు షాక్ ఇచ్చారు.   


వివరాల్లోకి వెళ్తే పెదపల్లి జిల్లా గోదావరిఖని సంజయ్‌ నగర్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సంజయ్‌ నగర్‌ లో నివసించే మాస రాజయ్య విద్యుత్తు సర్వీసు నెంబర్‌ 6218. రెండు నెలల కరెంటు బిల్లు ఏకంగా రూ.6,07,414 వచ్చి పెద్ద షాక్ ఏ ఇచ్చింది. ఆ కరెంటు బిల్లు. విద్యుత్తు మీటరులో సాంకేతిక సమస్య ఉందని ఆగస్టులో గుర్తించినా పరిష్కరించలేదంటూ లబోదిబోమంటూ అధికారులకు ఫిర్యాదు చేశాడు ఓ వినియోగదారుడు.         


సోమవారం విద్యుత్ సిబ్బంది ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల రీడింగ్‌ తీశారు. ఎప్పుడు వచ్చే వందల బిల్లు దాటి, వేలు దాటి, లక్ష ధాటి ఆ బిల్లు ఏకంగా ఆరు లక్షల ఏడు వేల నాలుగు వందల పధ్నాలుగు రూపాయిలు వచ్చింది. అయితే ఈ మేరకు విద్యుత్తు అధికారులకు తాను ఫిర్యాదు చేశానని వినియోగదారుడు రాజయ్య చెప్తున్నప్పటికీ వారికీ ఎలాంటి ఫిర్యాదు అందలేదని అసిస్టెంట్‌ ఇంజనీర్‌ సత్తయ్య తెలిపారు. మీటరులో లోపం ఉంటే సరి చేస్తామని వివరణ ఇచ్చారు. ఏది ఏమైనా ఒక మాములు మధ్య తరగతి వినియోగదారుడికి ఏకంగా రూ.6,07,414 రావడమంటే మాములు విషయం కాదు.       



మరింత సమాచారం తెలుసుకోండి: