కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీని దేశమంతా నేర్చుకోవాలనీ, దేశమంతటికీ ఒకే భాష ఉంటేనే ఐక్యంగా ఉంటామని, ఆ దిశగా అడుగులు వేస్తామని చెప్పినప్పటి నుండి తీవ్ర దుమారం రేగుతోంది. ముఖ్యంగా తమ మాతృభాషలని కన్నతల్లిలా ప్రేమించే దక్షిణాది రాష్టాల ప్రజల హిందీని తమపై రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాని ద్వారా తమ భాషలు అగాధంలో పడతాయని, భాషలు అగాధంలో పడడం అంటే తాము అగాధంలో పడ్డట్టే అని సోషల్ మీడియాలొ వార్తలు వస్తున్నాయి. 


అయితే తాజాగా సినీ నటుడు, రాజకీయ నాయకుడు మక్కల్ నీతి మయ్యమ్ నేత్ కమల్ హాసన్ ఈ విషయంపై తనదైన శైలిలో స్పందించాడు. మనదేశంలో విభిన్న సంస్కృతులు, ఆచారాలు, భాషలు ఉన్నందువల్లే దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అని పిలుస్తారు. ఆ మాటని విస్మరిస్తూ, దేశమంతా ఒకే భాష అంటూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.


మేము అన్ని భాషలను, అన్ని జాతులను గౌరవిస్తామని, హిందీ భాషని మాపై రుద్దాలని చూస్తే జల్లికట్టు కన్నా పెద్దగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇంకా మన జాతీయ గీతం అయిన "జనగణమన"  బెంగాలీలో ఉన్నా కూడా దేశం మొత్తం ఆ గీతాన్ని సంతోషంగా పాడుకుంటోంది. దానికి కారణం ఆ గీతాన్ని రచించిన వ్యక్తి అన్ని సాంప్రదాయాలను, సంస్కృతులను కలిపి రాశారు. అందుకే అది జాతీయ గీతం అయింది.


అంతే కానీ దేశం మొత్తం ఒకే భాష అని చెప్పి, హిందీని రుద్దాలని ప్రయత్నిస్తే అది తీవ్ర నష్టం దాలుస్తుందని, దానివల్ల దేశానికే నష్టం అని చెప్పుకొచ్చారు. దక్షిణాది పాఠశాలల్లో హిందీ తప్పనిసరి చేయాలని ముసాయిదా వచ్చినపుడు కూడా కమల్ హాసన్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం భాష మీద కాకుండా ఎకానమీని ఎలా అభివృద్ది చేయాలి అనే అంశాలపై దృష్టి పెడితే బగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.


కేరళ ముఖ్యమంత్రి కూడా స్పందిస్తూ,సంఘ్ పరివార్ భాష పేరుతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తుందని, అంతే కాకుండా హిందీ తప్ప మిగతా భాషల్లో మాట్లాడే వారిని రెండో తరగతి పౌరులుగా చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రాహుల్ గాంధీ కూడా ఈ మేరకు ట్విట్టర్ లో స్పందిస్తూ, ఇండియాలో ఎక్కువ భాషలు ఉండడం తన బలమే అవుతుంది తప్ప బలహీనత కాదని ట్వీట్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: