ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతి గుంటూరు జిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి వాసులకు కలవరానికి గురుచేసింది. మంత్రిగా ఈ ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ది పనులు చేసిన కోడెల ఈ రెండు పట్టణాలలో  రాజకీయ నాయకుడిగా చేసిన సేవలు చిరస్మరణీయం. ఓ వైపు అభివృద్ధి మరోవైపు కోటప్ప కొండలోని  త్రికోటేశ్వరుడి నామస్మరణ ఈ రెండు కోడెలను ఈ ప్రాంతంలో తిరుగులేని నాయకున్ని చేశాయి.

గుంటూరు జిల్లా లోని నరసరావుపేట, సత్తెనపల్లి... ఈ రెండు కోడెలకి రెండు కళ్ళు లాంటివి. నరసరావుపేట అంటే కోడెల అనే విధంగా అభివృద్ధి చేశారు. పట్టణంలో ప్రజలకు నేడు రెండు పూటలా మంచి నీరు కుళాయిలు ద్వారా  వస్తుంది అంటే అది కోడెల చేసిన శ్రమ. టౌన్ హాల్, షాది ఖానా, స్టేడియం, నరసరావుపేట నియోజకవర్గoలోని  63 గ్రామాలకు  రహదారులు వేసి ప్రజల సమస్యలను అడగకుండానే పరిష్కరించారు. నరసరావుపేటలో రాజకీయాలు కూడా కోడెల హయాంలోనే పాపులర్ అయ్యాయి. పేట పొలిటికల్ స్క్రీన్ పై కోడెలదే పైచేయిగా ఉండేది.

సత్తెనపల్లి అభివృద్ధిలోనూ కోడెలది కీలకపాత్ర. సత్తెనపల్లిలో కోడెల హయాం ఒక స్వర్ణయుగం. ఐదేళ్ల క్రితం సత్తెనపల్లికి ప్రస్తుత పట్టణానికి భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. పలు ప్రభుత్వ కార్యాలయాలు, విశాలమైన రోడ్లు.. తారక రామ సాగర్ ప్రాజెక్టు, వావిలాల పార్కు, అంతే  కాకుండా మున్సిపల్ కూరగాయల మార్కెట్ నూతన భవనం  ..ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం అభివృద్ధి చేశారు కోడెల. పల్లెటూరులో రోడ్లు, మరుగుదొడ్లు, రైతులకు శాస్త్రవేత్తలు ద్వారా సూచనలు, వంటి ఎన్నోఅభివృద్ధి పనులు చేసి సత్తనపల్లిలో తనకంటూ ఓ ఘనతను దక్కించుకున్నారు. 

ఇక కోటప్పకొండ అంటే కోడెలకు ప్రత్యేక అభిమానం. ఆ త్రికోటేశ్వరుడికి కోడెల శివప్రసాదరావు పరమ భక్తుడు. శివరాత్రి వచ్చిందంటే చాలు..తెలుగు  రాష్ట్రాల భక్తులు కోటప్పకొండ కొండ తిరునాళ్ళు  కోసం తరలివచ్చేవారు. త్రికోటేశ్వరుడి ఆలయంలో అభివృద్ధి కోసం కోడెల విశేషంగా కృషిచేశారు. ఘాట్ రోడ్డు నిర్మాణం కోడెల శివప్రసాదరావు హయాంలోనే సాధ్యమైంది. దీంతో కొండ స్వరూపమే మారిపోయింది. కొండ మీద ఎకో పార్క్ ను డెవలప్ చేసి ఒక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దారు. జాతీయ స్థాయిలో హిల్ ఫెస్టివల్ నిర్వహించారు. మొత్తంగా కోటప్పకొండను గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దిన ఘనత కోడెలకే దక్కింది. ఇలా నరసారావుపేట, సత్తెనపల్లిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కోడెల శివప్రసాదరావు చనిపోవడాన్ని ఆక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: