మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ పై విశాఖ పట్టణంలో క్రిమినల్ కేసు నమోదైంది. విశాఖ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారని సమాచారం. బీచ్ రోడ్డులో ఇస్కాన్ ఆలయానికి సమీపంలో ఉన్న స్థలం ఆక్రమించుకోవటంతో పాటు వట్టి వసంత్ కుమార్, కొణతాల రామ్మోహన్ రావ్ తుపాకితో తనను బెదిరించారని ఆ వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 
 
పోలీసులు ఆక్రమణ, ఆయుధ చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 1000 గజాలకు సంబంధించిన స్థలం ప్రస్తుతం కోర్టు వివాదాల్లో ఉందని సమాచారం. పోలీసులు ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు మొదలుపెట్టారు. వట్టి వసంత్ కుమార్ ప్రస్తుతం అఙాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. 
 
కేసు నమోదు చేసిన వ్యక్తి తెలుపుతున్న వివరాల ప్రకారం తమ సొంత పొలానికి రక్షణగా గేటు ఏర్పాటు చేసుకోవాలని, స్థలంలో ఉన్న కొబ్బరి చెట్లను తీసేయాలని ప్రయత్నిస్తుంటే మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ తమను బెదిరించారని ఆ సమయంలో అతని చేతిలో తుపాకి ఉందని ప్రసాద్ అనే వ్యక్తి తెలిపాడు. సాగర్ నగర్ ప్రాంతంలో ఉన్న ఆ స్థలం తనదైనప్పటికీ తనది కాదని అంటున్నారని ఆ స్థలంతో వసంత్ కుమార్ కు సంబంధం లేదని ప్రసాద్ తెలిపాడు. 
 
అక్కా తమ్ముడి పేరు మీద ఉన్న 1000 గజాల స్థలంలో ఉన్న కొబ్బరి చెట్లను తీసేయాలని పని చేస్తున్న సమయంలో వట్టి వసంత్ కుమార్, కొణతాల రామ్మోహన్ ఇద్దరూ వచ్చి పని చేసే వారిని వెళ్లిపోకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారని బెదిరించారని తెలిపాడు. ఈ స్థలం మాదే అని చెప్పినా వినకుండా ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అని మీద మీదకు వచ్చి తుపాకితో బెదిరించారని ప్రసాద్ తెలిపాడు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: