ప్రధాని 69 వ పుట్టినరోజు వేడుకలు దేశంలో బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు.  ఈ వేడుకల్లో భాజపా శ్రేణులు భారీ ఎత్తున పాల్గొంటున్నాయి.  బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ మోడీ గురించిన విషయాలను నాయకు చెప్తున్నారు.  మోడీ జీవితంలో జరిగిన విషయాలు కొన్ని చాలా కీలంగా ఉంటాయి.  మోడీ జీవితాన్ని మార్చిన వాటిలో అలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలో జారిటితే.. అందరు అభివృద్ధి చెందుతారు.  చాలామంది వీక్ మైండ్ కారణంగానే ఎదగలేకపోతుంటారు.  


ప్రధాని మోడీ రాజకీయాల్లోకి వెళ్ళాలి అనే ఆలోచన తన ఆరో సంవత్సరంలోనే కలిగింది.  దానికి ఉహరహరణే ఇది. మోడీ ఆరేళ్ళ వయసులో ఉండగా 1956లో వాద్ నగర్ లో అప్పటి కాంగ్రెస్ గుజరాత్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రసిక్ భాయ్ దవే ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఫండ్ రైజింగ్ కోసం జరుగుతున్న కార్యక్రమం అది.  ఆ కార్యక్రమంలో 6 సంవత్సరాల వయసును మోడీ కూడా పాల్గొన్నాడు.  తన వంతుకు పనిచేస్తానని మోడీ చెప్పారట.  దానికి దవే.  చిన్న వయసులో నువ్వు ఏం చేస్తావని అడిగితె.. బ్యాడ్జీలు పంచడం లేదా అమ్మడం ద్వారా నిధులు సేకరిస్తామని మోడీ చెప్పారట.  


ఈ విషయాన్ని దవే ఎన్నోసార్లు పేర్కొన్నారు.  ఆ సమయంలో దవే ఇచ్చిన ప్రోత్సాహంతో మోడీ బ్యాడ్జీలు పంచారు.  ఆ తరువాత మోడీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, బీజేపీ నాయకుడిగా ఎదిగిన సమయంలో కూడా దవేను చాలా గౌవరంగా చూసేవారు.  వాళ్ళను మర్యాదపూర్వకంగా చాలాసార్లు మోడీ కలిశారని, మోడీ జీవితంలో దవేకు మంచి స్థానంఉందని ది మ్యాన్ ఆఫ్ మూవ్ మెంట్ నరేంద్ర మోడీ పుస్తక రచయితలు పేర్కొన్నారు. 


అంతేకాదు, 1999లో మోడీ గుజరాత్ రాష్ట్రానికి బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేసిన రోజుల్లో మోడీ దవే దంపతులను కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.  మోడీ జీవితంలో దవే కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది.  దవే కుటుంబంతో అనుబంధం గురించి మోడీ కూడా అనేకమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. 1950లో సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నరేంద్ర దామోదర్‌దాస్‌ మోదీ.. అంచెలంచెలుగా ఎదిగి భారత ప్రధానిగా అత్యున్నత స్థాయికి చేరుకున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: