తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తెరాస ముఖ్యనేత ఆర్ధిక శాఖామంత్రి హరీష్ రావు తో భేటీ అవ్వటం వెనుక కారణం ఏంటని తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది . మొన్న జరిగిన ఎన్నికల   తర్వాత భారీ మెజారిటీ సాదింది అధికారాన్ని రెండో   సారి చేజిక్కించుకుంది తెరాస .ఈ విషయం అందరికి తెలిసందే .అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎల్పీ ని తెరాస లో విలీనం చేసుకుంది టీఆర్ఎస్ . కాగా రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ నుండి జంప్ అవుతాడని మొన్నటి వరకు వార్తలు రాగా  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బహిరంగంగానే కొన్ని సార్లు వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పకనే చెప్పారు . 


అయితే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో  చేరటం లేట్ అవుతుండటం తో   ఏదైనా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారా  అని అందరు అనుకుంటున్నా తరుణంలో యూ టర్న్ తీసుకుని వచ్చే ఎన్నికల్లో  తెలంగాణాలో మళ్ళి  కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ కాంగ్రెస్ కి జై కొట్టారు.అయితే కోమటి రెడ్డి బీజేపీ తీర్థం ఆలోచన విరమించుకున్నట్టున్నారు అనుకుంటుంతుండగా ... కానీ కోమటి రెడ్డి హరీష్ రావు తో భేటీ అవ్వటం తో కోమటిరెడ్డి జంపింగ్ బీజేపీ లోకి కాదు అధికార తెరాస లోకి అని చర్చించుకుంటున్నారు అందరు.


తెలంగాణ అసెంబ్లీ లాబీలో హరీష్ రావుతో అరగంట పాటు కోమటి రెడ్డి చర్చలు జరిపారు. దీంతో కోమటి రెడ్డి చూపు బీజేపీ పై నుండి తెరాస పైకి మళ్లినట్టుంది అనుకుంటున్నారు. దీంతో త్వరలో కోమటి రెడ్డి తెరాస లో చేరతాడని ఉహాగానాలొస్తున్నాయి . ఇదిలా ఉండగా ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హరీష్ రావు ని తమ నియోజక వర్గ అభివృద్ధి  కి నిధుల కేటాయించాలని  కోరడానికి హరీష్ తో కోమటి రెడ్డి సమావేశం అయ్యారని కొందరు భావిస్తున్నారు .ఏది ఏమైనా హరీష్ రావు తో కోమటి రెడ్డి భేటీ మాత్రం  తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తిరేపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: