ఈ మద్య విమానాల్లో ప్రయాణించాలంటేనే భయం భయంగా ఉందని కొంత మంది ప్రయాణీకులు అభిప్రాయ పడుతున్నారు..దానికి కారణం ఏదో సాాంకేతిక లోపాల వల్ల విమానం ప్రమాదాలు జరుగుతున్నాయి.  ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా ప్రైవేట్ విమాన యాజమాన్యాలు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు..అలాగే విమానం ల్యాండ్ అయ్యే హైవే ల్లో కూడా కొన్ని లోటుపాట్లు ఉండటం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణీకులు అభిప్రాయం.


తాజాగా  గన్నవరంలో ఈదురుగాలులతో కుడిన భారీ వర్షం కురుస్తుంది. ఈ వర్షం కారణంగా గన్నవరం విమానాశ్రయంలో హైదరాబాద్  విజయవాడ ఏయిర్ ఇండిగో  విమానానికి వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ల్యాండింగ్ కు  సహకరించడంలేదు. దీంతో గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన విమానం అక్కడక్కడే గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఆ విమానంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తల్లి విజయమ్మ ఉన్నట్లు సమాచారం. దీంతో విమాన ల్యాండింగ్ కు ఇంజన్ లో ఎలాంటి సాంకేతిక పరమైన  లోపం తలెత్తిందా లేక వర్షం వల్లనే విమానం ల్యాండింగ్ కు సహకరించడంలేదా అనే టెన్షన్ నెలకొంది.  హైదరాబాద్ నుంచి విమానం బయలుదేరే సమయంలో వాతావరణం బాగానే ఉన్నప్పటికీ గన్నవరంకు చేరుకునే సమయానికి వాతావరణ పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు సమాచారం.   గన్నవరం విమానాశ్రయ ప్రాంతంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరిన విమానం ల్యాండింగ్ కు సహకరించడంలేదని గన్నవరం ఎయిర్ పోర్ట్ సిబ్బంది తెలిపారు.


గతంలో కూడా వర్షంతో పాటూ వాతావరణం సహకరించకపోవడం వల్ల పలు  విమానాలు.. విమానాశ్రయంలో కాకుండా ఎయిర్ పోర్టు హైవే దాటిన సందర్భాలు ఉన్నాయి.  ఆ సయమయంలో ఫైలెట్లు చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని ల్యాండ్ చేయగా, మరి కొన్ని విమానాలు ప్రమాదానికి గురయ్యాయి.  గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ కూడా ఇలాగే వాతావరణం అనుకూలించక ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.  ప్రస్తుతం విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేసే ప్రయత్నంలో పైలెట్లు ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: