ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రలోని పేదింటి ఆడబిడ్డలకు శుభవార్త చెప్పాడు. పెళ్ళయాక ఆడబిడ్డలు అందరూ ఆనందంగా ఉండాలని వైఎస్సార్ పెళ్లి కనుక సాయంను భారీగా పెంచాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారం చేతిలోకి వచ్చినప్పటి నుండి రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ ఆంధ్ర ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్నాడు వైఎస్ జగన్. 


అతని పరిపాలనతో రాజన్న రాజ్యాన్ని గుర్తు చేస్తున్నాడు వైఎస్ జగన్. ప్రతిపక్షాలు ఎన్నిసార్లు విమర్శలు చేసిన పట్టించుకోకుండా తన పని తాను చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ముఖ్యమంత్రిగా పేరొందారు. ఎన్నికల ప్రచార సమయంలో, ఎన్నికల మేనిపెస్టోలో చెప్పినట్లుగా ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ, దివ్యంగులకు చెల్లిస్తున్న పెళ్లి కానుక ప్రోత్సాహకాన్ని భారీగా పెంచాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 


వైఎస్సార్ పెళ్లి కానుక ఆర్థిక సాయాన్ని పెంచుతూ జీవో జారీ చేశారు. ఈ మేరకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రవిచంద్ర నిన్న(సోమవారం) ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీలకు రూ.40 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహానికి రూ.75 వేల మొత్తాన్ని ఏకంగా రూ. 1.20 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్టీలకు రూ.50వేల నుంచి రూ.లక్షకు పెంచారు. 


కాగా, బీసీలకు రూ.35వేల నుంచి రూ.50 వేలకు. బీసీ కులాంతర వివాహానికి రూ.50 వేల నుంచి రూ.75 వేలకు, మైనార్టీలకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. అలానే దివ్యాంగులకు రూ.లక్ష నుంచి రూ. లక్షన్నరకు పెంచారు. కాగా భవన నిర్మాణ కార్మికులకు రూ.20 వేల నుంచి రూ.లక్షకు పెంచుతూ ఆదేశాలను జారీ చేశారు. దీంతో ఆంధ్ర ఆడబిడ్డల ముఖాల్లో ఆనందాలు విరాజిల్లుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: