తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ స్పీకర్  డాక్టర్  కోడెల శివ‌ప్ర‌సాద‌రావును రాజ‌కీయంగా ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు చంపుతూనే వ‌స్తున్నాడు. విషయంలో ఆయన విషయంలో మొదటి నుంచి చంద్రబాబు అనుసరించిన తీరుపై సోషల్ మీడియాలో ఏడే ఏడు అంశాలలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొదట ప్రశ్న వచ్చి.. ప్రధానంగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని అసెంబ్లీకి చెందిన ఫర్నిచర్ ఎత్తుకెళ్లానని స్వయంగా దివంగత నేత కొడెల ఒప్పుకున్నాడు. ఈ విషయం అందరికి తెలిసిందే. అప్పుడు పార్టీ పరువు పోయిందని పార్టి అద్యక్షుడిగా ఉండి కోడెలను ఎందుకు వివరణ అడగలేదని చంద్రబాబును నిలదీస్తున్నారు. ఏ కారణం చేత అప్పట్లో అతనిపై యాక్షన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఇక రెండొవ ప్రశ్న ఏంటంటే.. కొడెలకు గుండెనొప్పి అని అనారోగ్యంతో హాస్పటల్ లో జాయిన్ అయినప్పుడు పార్టి అద్యక్షుడిగా హాస్పటల్ కానీ ఇంటికి కానీ వెళ్లి ఎందుకు పరామర్శించలేదని కొశ్చన్ ఉత్పన్నమవుతుంది. మూడో ప్రశ్న చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చి అదే ప్రాంతానికి ఎన్నో ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న కోడెలను ఆ కార్యక్రమానికి ఎందుకు రమ్మని ఆదేశాలు ఇవ్వలేదంటూ ప్రశ్నల పరంపర కొనసాగుతుంది.


నాల్గో ప్రశ్నలేంటంటే  పల్నాడు పులిగా పిలవబడుతున్న కోడెల టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే ఎందుకు రోడ్డెక్కలేదని ప్రశ్నల రూపంలోని తూటాలను పేలుస్తున్నారు. అంతేకాదు చలో ఆత్మకూరులో ఎందుకు పాల్గొనలేదని పార్టి అధినేతగా కోడెలను ఎందుకు వివరణ అడగలేదంటున్నారు. ఐదో ప్రశ్న.. కే  టాక్స్, ఫర్నిచర్ దొంగతనం అనేవి ఆరోపణలు అయితే పార్టీ అద్యక్షుడిగా వాటిని ప్రస్తావించకుండా కనీసం ఖండించకుండా  గత నెలరోజులు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నెటిజనులు చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఆరో క్వశ్చన్ వచ్చి.. ప్రభుత్వం వేదింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడంటూ  స్టేట్ మెంట్ ఇప్పుడెందుకు ఇచ్చారని నిలదీస్తున్నారు. 




వేధింపులు అని తెలిస్తే కొడెలతో కలిసి ప్రెస్_మీట్ పెట్టి  ప్రభుత్వాన్ని అప్పుడే ఎందుకు నిలదీయలేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు.  చివరిగా ఏడో ప్రశ్నఏటంటే.. గత రెండు నెలల్లో చంద్రబాబు కోడెలకు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు.. ఎన్ని సమావేశాలకు పిలిచారు..అన్న క్వశ్చన్స్ ను సంధిస్తున్నారు. ఏ సందేహాల నేపథ్యంలో కోడెల మొబైల్ ఫోన్ మాయం కావడం కొసమెరుపు. వాస్తవానికి వీటికి ఆన్సర్ ఉన్నా దొరకదు. ఇప్పుడు మాత్రం కోడెల ఆత్మహత్యకు వైసిపీ వేధింపులు అని కోడెల భౌతిక కాయం ఎదుట స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇదేదో నెల ముందే ఇవ్వచ్చుగా.. కానీ ఇవ్వలేదంటూ చంద్రబాబుపై సంధించిన  ప్రశ్న అస్త్రాలు  సోషల్ మీడియా  వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని ఎన్  టి ఆర్ ట్రస్టు భవన్ నుంచి బయలుదేరిన కోడెల భౌతిక కాయం కొద్దీ సేపటి క్రితం గుంటూరుకి చేరింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: