సమాజంలో స్వార్ధం ఎలావుందంటే అది ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఐతే,తన కూతురు మాత్రం అత్తింట్లో సుఖంగా వుండాలి,తన కూతురు చెప్పినట్లు అల్లుడు వినాలి, కాని తనింటికి వచ్చిన కోడల్ని మాత్రం రాచి రంపాన పెట్టాలి,కట్నం తేలేదని,ఆడపిల్లని కన్నావని,ఇలా ఏవిషయంలో దొరికిన వదలకుడదు.అలా చేసే ముందు ఆ అత్తకు ఇంతైన ఆలోచన రాదా.తనూ ఓ ఆడదాన్నేనని,ఒకప్పుడు తాను కోడలిగా వచ్చానని.సాటి ఆడదే,ఓ ఆడపిల్ల మనసు తెలుసుకోకుంటే ఇక కట్టుకున్నోడు ఏం అర్ధం చేసుకుంటాడు.సమాజంలో నీతులు చెప్పేవారు కూడా నీతి తప్పుతున్న కాలంలో,వేధింపుల విషయంలో చట్టాలెన్ని వచ్చిన అవేమి దుర్మార్గుల ఆటలు ఆపడం లేదు. ఆడపిల్లను కన్నప్పటినుండి మొదలైన ఆవేదన అత్తింటికి పంపించిన కూడా ఏ తల్లిదండ్రులకు తీరడం లేదు.ఈ తరుణంలో ఆడజన్మకు అర్ధమే లేదా,ఆమె రోదన ఎన్నటికి తీరని వేదనేనా..వారికి దెబ్బతాకితే నొప్పి కలుగుతుంది,అదే దెబ్బ ఎదుటివారికి తాకితే హాయిగా వుంటుందా ఇదేనా మనుషులు నేర్చుకొనేది.ఇలా ఎలాంటి ఆలోచనకుండా తన యింటికి వచ్చిన కోడల్నిబాలింత అని కూడ చూడకుండా దారుణ హింసలకు గురిచేసిన సంఘటన గురించి తెలుసుకుందాం.. 



జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన ఈ దారుణంలో బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన బాస గంగాధర్,కాంత దంపతుల కుమార్తె మౌనికను కోరుట్లలోని ప్రకాశం రోడ్డు ప్రాంతానికి చెందిన ముదిగొండ రంజిత్‌కు ఇచ్చి 14 నెలల కిందట వివాహం జరిపించి,పెళ్లి సమయంలో కట్నం కింద రూ.5 లక్షల వరకు  అందజేశారట.అయితే కొన్ని రోజుల క్రితం గర్భవతి ఐన మౌనిక పుట్టింట్లో 40 రోజుల కిందట పండంటిబాబుకు జన్మనిచ్చింది.ఆతర్వాత బారసాల కార్యక్రమాలన్ని పూర్తైన తర్వాతా అత్తింటివారింటికి వెళ్ళినప్పటినుండి మరింత కట్నం తేవాలని ఆమెను వేధిస్తున్నారట.మౌనిక పైన వేధింపులు ఎక్కువవడంతో ఆమె పుట్టింట్లోనే ఉంటోంది.



అయితే తనకు సంబంధించిన సర్టిఫికెట్లు తీసుకునేందుకు అత్తగారింటికి వచ్చిన సమయంలో మౌనికను చూసిన వెంటనే రెచ్చిపోయిన భర్త రంజిత్ ఆమెను విచక్షణ రహితంగా కొట్టాడట.ఈ చర్యను అడ్డుకోని మౌనిక అత్త  కొడుకుకు వత్తాసు పలుకుతూ మామ రాజేశంతో కలసి దాడి చేశారని,తనను ఇంట్లోకి రానివ్వకుండా రోడ్డుపైకి తరిమి కొట్టారని బాధితురాలు చెబుతూ,ఆవేదన వ్యక్తం చేసింది.వారింటికి ఒంటరిగా వెళ్లాను కాబట్టే బతికి పోయాననీ.ఒకవేళ తన కొడకును కూడా తీసుకుని పోయుంటే బాబును లాక్కొని తనను చంపేసేవారని కన్నీరుమున్నీరయింది.ఇక తీవ్రంగా గాయపడ్డ మౌనికను స్థానికులు అంబులెన్స్‌లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.ఇక కేసులో వచ్చే తుది తీర్పులో ఎవరికి న్యాయం జరుగుతుందోనని.ఆసక్తితో ఎదురు చూస్తున్నారు చుట్టుపక్కల జనం...  


మరింత సమాచారం తెలుసుకోండి: