ఆంధ్ర ప్రదేశ్ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాద్ రావు నిన్న మధ్యాహ్నం 12 గంటలకు కన్నుమూశారు. కోడెల మృతి చెందిన సమయం నుంచి శవ రాజకీయాలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులూ. వైసీపీ ప్రభుత్వం వల్ల కోడెల మృతి చెందారని ఆరోపణలు చేస్తున్నారు. కోడెల శివ ప్రసాద్ ని మానసికంగా వేధించారని అందుకే అయన ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. 

 

 
అయితే ఈ విషయంపై స్పందించిన అంబటి రాంబాబు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మీడియాతో సమావేశమైన అంబటి రాంబాబు మాట్లాడుతూ కోడెల మృతిపై ఆసక్తికర విషయాలు తెరపైకి తీసుకువచ్చారు. ''చంద్రబాబు నాయుడు కోడెల మృతి సంఘటన నుంచి లబ్ధిపొందాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని, కోడెల మృతి అంశాన్ని వైఎస్ జగన్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అయన వ్యాఖ్యానించారు. 

 

 
చంద్రబాబుది నీచమైన ఎత్తుగడ అని అన్నారు. కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకోవటం బాధాకరం అని, కోడెల ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఎందుకు వచ్చాయి ? పల్నాటి పులి అనే వ్యక్తి ఎందుకు ఉరేసుకున్నాడు ? అని అంబటి ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలి అంటూ కోడెలపై ప్రభుత్వం కానీ, వైసీపీ నేతలు కానీ కేసులు పెట్టలేదు అని టీడీపీ నేతలే అతని కేసులు పెట్టారని చెప్పారు. 

 

 
కోడెల ఆత్మహత్యకు కారణం కేసులు కాదని అతని ఆత్మహత్యకు అయన కుటుంబం, తెలుగుదేశం పార్టీయే కారణమని వెల్లడించారు, కోడెల కుటుంబం గురించి చంద్రబాబు దారుణంగా మాట్లాడారు, అతను వారం రోజులు ఆసుపత్రిలో ఉంటె బాబు ఒక్కసారి పరామర్శించలేదు అంతటి గొప్పవాడు చంద్రబాబు అని అయన వ్యాఖ్యానించారు.   

 

 
చంద్రబాబు తీరు వల్లే కోడెల శివ ప్రసాద్ ఉరేసుకున్నాడు, చంద్రబాబు దీన్ని వైసీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు. చంద్రబాబు కోడెలకు చివరి రోజుల్లో కూడా ఆపాయిట్మెంట్ ఇవ్వలేదు,అయన చనిపోయాక హడావిడి చేస్తున్నారు..  కోడెల మృతి నుంచి లబ్దిపొందే నీచ రాజకీయం చేస్తున్నారు.. కోడెలపై బాబుకు ప్రేమ ఉంటె రాజకీయ వారసులను ప్రకటించాలి అంటూ డిమాండ్ చేశారు. 

 

 
సత్తెనపల్లి నుంచి కోడెల కూతుర్ని, నరసారావు పేట నుంచి కోడెల కొడుకుని కోడెల రాజకీయ వారసులుగా ప్రకటించాలి. చంద్రబాబు చేస్తున్నదంతా దొంగ నాటకం అని అంబటి వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: